Hair Care: వెంట్రుకల చివర్లు చిట్లిపోతున్నాయా? ఈ సూపర్ సీక్రెట్స్‌తో సమస్యకు చెక్..
Split ends of hair: మీ జుట్టు ఎంత బాగున్నా చివర్లు చిట్లిపోతున్నాయా? జుట్టు రోజురోజుకు డల్‌గా, నిర్జీవంగా మారుతుందా? డోంట్ వర్రీ! ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మీ జుట్టు మళ్లీ ఆరోగ్యంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

వెంట్రుకల చివర్లు చిట్లిపోతున్నాయా?
జుట్టు దట్టంగా, పొడవుగా ఉన్నా… చివర్లు చిట్లిపోతే జుట్టు అందం తగ్గిపోతుంది. చిట్లిన వెంట్రుకలు జుట్టు పెరుగుదలను కూడా ఆపేస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, జుట్టు పొడిగా మారడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు పెరిగిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాల్లోనే ఉంది. అది ఎలానో తెలుసుకుందాం.
బాదం నూనెతో చిట్లిన జుట్టుకు చెక్!
బాదం నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, విటమిన్ A వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా చిట్లిన జుట్టును తగ్గించడంలో బాదం నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఈ నూనెను తలపై అప్లై చేసి, ఒక గంట సేపు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే చిట్లిన వెంట్రుకలు క్రమంగా తగ్గుతాయి. బాదం నూనె జుట్టుకు తేమనిచ్చి, చివర్ల బలహీనతను తొలగించి, మృదువుగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
అరటిపండు హెయిర్ మాస్క్‌తో
విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న అరటిపండు జుట్టుకు సహజమైన పోషణనిస్తుంది. ఇది జుట్టు చివర్ల చిట్లడం తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండు జుట్టును బలపరచి, తేమను నిలుపుతుంది, దీంతో చిట్లే ప్రమాదం తగ్గుతుంది.
ఉపయోగించే విధానం: ఒక పచ్చి అరటిపండును మెత్తగా ముద్ద చేయాలి. అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి ట్రై చేస్తే.. చిట్లిన జుట్టు సమస్య తగ్గుతుంది. అలాగే.. జుట్టు మృదువుగా మారుతుంది.
ఆలివ్ నూనెతో చిట్లిన జుట్టుకు పరిష్కారం
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఆలివ్ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సహజ కొవ్వులు జుట్టుకు తేమనిచ్చి, చర్మానికి పోషణనిస్తాయి. ఈ నూనె జుట్టు పొడిబారకుండా, చిట్లకుండా కాపాడుతుంది.
ఉపయోగించే విధానం: ఆలివ్ నూనెను చిట్లిన జుట్టు చివర్లకు, స్కాల్ప్‌కి మృదువుగా మసాజ్ చేయాలి. ఈ నూనెను ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1–2 సార్లు ఉపయోగిస్తే, చిట్లిన జుట్టు తగ్గి, జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుంది.
కలబంద జెల్‌తో
కలబంద జెల్ (Aloe Vera Gel) జుట్టు, చర్మ సంబంధిత సమస్యలకు అద్భుతమైన సహజ చికిత్సగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే హైడ్రేటింగ్ గుణాలు జుట్టులో తేమను నిలుపుతాయి. పొడి తల చర్మాన్ని మృదువుగా చేస్తాయి, అలాగే చిట్లిన జుట్టును తగ్గించడంలో సహాయపడతాయి.
ఉపయోగించే విధానం: తాజా కలబంద జెల్‌ను తీసుకొని, జుట్టు చిట్లిన చివర్లకు స్కాల్ప్‌కి మృదువుగా అప్లై చేయాలి.ఆ తరువాత 30–40 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు మృదువుగా మారుతుంది. చిట్లిన వెంట్రుకలు తగ్గుతాయి. జుట్టు పెరుగుదల కూడా మెరుగవుతుంది.
జుట్టు చిట్లడాన్ని నివారించడానికి మార్గాలు :
- క్లోరిన్ కలిసిన నీటితో స్నానం చేయకూడదు.
- తడి జుట్టుకు స్ట్రెయిట్‌నింగ్ చేయకూడదు.
- ఎక్కువ వేడితో హెయిర్ డ్రైయర్ వాడకూడదు.
- వారానికి రెండుసార్లు తలకు నూనె పట్టించి స్నానం చేయాలి.
- పోషకాలు, నీరు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- తాజా అలొవెరా జెల్ జుట్టుకు అప్లై చేసి, కొంతసేపు ఉంచి శుభ్రం చేయాలి.
- బాదం నూనె లేదా ఆలివ్ నూనెతో తల మసాజ్ చేయాలి.
- అరటిపండు ముద్దలో నిమ్మరసం కలిపి జుట్టుకు ప్యాక్‌గా వాడాలి.
- హీట్ స్టైలింగ్ టూల్స్ వాడకాన్ని తగ్గించాలి.
- తల కడిగేటప్పుడు వేడి నీరు కాకుండా గోరువెచ్చని నీటిని వాడాలి.
- జుట్టు చివర్లను నెలకోసారి కట్ చేయాలి.