MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Hair Care Tip: రోజూ ఇదొక్కటి తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు

Hair Care Tip: రోజూ ఇదొక్కటి తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు

Hair Care Tip: ఈ కంప్యూటర్ యుగంలో జుట్టు రాలడం ప్రతి ఒక్కరికీ సమస్యే.  అందుకోసం రకరకాల షాంపూలు,హెయిర్ ప్యాక్ లు, కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటారు. కానీ ఇవేవీ అక్కర్లేదు. రోజూ ఇదొక్కటి తింటే ఒక్క వెంట్రుక కూడా రాలదు.

1 Min read
Author : Nandini Arava
Published : Mar 05 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జుట్టు పెరుగుదలకు చిలగడదుంప
Image Credit : Getty

జుట్టు పెరుగుదలకు చిలగడదుంప

జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారడం వంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన డైట్ లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని పోషకాహారాలు జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడతాయి. వాటిలో చిలకడదుంప (Sweet Potato) ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 స్వీట్ పొటాటోతో జుట్టు మందంగా, ఆరోగ్యంగా
Image Credit : Getty

స్వీట్ పొటాటోతో జుట్టు మందంగా, ఆరోగ్యంగా

చిలకడదుంపలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, ఐరన్, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మాడును ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ A గా మారుతుంది. కుదుళ్లనుంచి నేచురల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచి జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. 

జుట్టు బలంగా పెరగడానికి తల చర్మానికి సరైన రక్తప్రసరణ అవసరం. చిలకడదుంపలో ఉన్న పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి. కొత్త జుట్టు పెరుగుదలకి దోహదపడతాయి. క్రమంగా చిలకడదుంపను ఆహారంలో చేర్చడం వల్ల జుట్టు మందంగా, ఆరోగ్యంగా మారుతుంది.

34
చిలకడదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్
Image Credit : Getty

చిలకడదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్

ఇంకా చిలకడదుంపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. మాడును రక్షించి, జుట్టు ముందుగానే తెల్లబడే సమస్యను తగ్గించడంలో సహాయపడవచ్చు. అలాగే చిలకడదుంపలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మంచి జీర్ణం బాగా అవుతుంది. జీర్ణక్రియ బాగుంటే పోషకాలు సరిగ్గా శరీరానికి అందుతాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. కాస్త తిన్నా…కడుపు నిండిన భావం కలిగి ఫుడ్ కంట్రోల్ అవుతుంది.

44
పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది
Image Credit : stockphoto

పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది

చిలకడదుంపను ఉడకబెట్టి తినవచ్చు, కూరలలో వేసుకోవచ్చు లేదా స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో పాటు చిలకడదుంప వంటి పోషకాహారాన్ని తీసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేచురల్ గా జుట్టు పెరుగుదల కోరుకునేవారికి చిలకడదుంపతో ఫలితం చూడొచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Grey Hair: కలర్స్ తో పనిలేదు.. పెరుగులో ఇది కలిపి రాసినా తెల్ల వెంట్రుకలు మళ్లీ నల్లగా మారతాయి
Recommended image2
Hair Care Tips: పొడవుగా, ఒత్తుగా జుట్టు పెరగాలంటే ఈ విటమిన్లు, ప్రోటీన్లు తినాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved