MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?

Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?

వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తినొచ్చా? లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 04 2026, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : Getty

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చకాయలో విటమిన్ C, A, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, చర్మ కాంతికి సహాయపడతాయి. అంతేకాదు పుచ్చకాయ, శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది. దాదాపు 90 శాతం నీటితో ఉండే ఈ పండు వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. అయితే దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గది ఉష్ణోగ్రతలో..
Image Credit : Getty

గది ఉష్ణోగ్రతలో..

ఆరోగ్య నిపుణుల ప్రకారం, పుచ్చకాయను గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా లైకోపిన్ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గది ఉష్ణోగ్రతలో కొంతమేర స్థిరంగా ఉంటాయి. అయితే ఒకసారి పుచ్చకాయను కోసిన తర్వాత, దాన్ని తప్పనిసరిగా ఫ్రిజ్‌లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కోసిన పండ్లు గాలికి ఉంటే బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

35
ఎక్కువ రోజులు నిల్వ చేస్తే..
Image Credit : stockphoto

ఎక్కువ రోజులు నిల్వ చేస్తే..

నిపుణుల ప్రకారం కోసిన పుచ్చకాయ ముక్కలను గాలి చొరబడకుండా డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో 4°C వద్ద నిల్వ చేయాలి. ఇలా చేస్తే 24 నుంచి 48 గంటల వరకు సురక్షితంగా తినవచ్చు. అయితే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడం మంచిది కాదు. పండు రంగు మారడం, వాసన మారడం, రుచి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని తినకపోవడమే మంచిది.

45
ఈ సమస్యలు వచ్చే అవకాశం..
Image Credit : Getty

ఈ సమస్యలు వచ్చే అవకాశం..

ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల కొందరికి జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే గొంతు లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా చల్లగా ఉన్న పండ్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. చల్లగా ఉన్న పుచ్చకాయను వేడి వాతావరణంలో ఎక్కువ మోతాదులో తింటే కడుపులో మంట, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

55
ఈ జాగ్రత్తలు అవసరం..
Image Credit : our own

ఈ జాగ్రత్తలు అవసరం..

పుచ్చకాయను ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే తినకుండా, కొద్దిసేపు బయట ఉంచి చల్లదనం తగ్గిన తర్వాత తినడం మంచిది. ఇది జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పుచ్చకాయను రాత్రి పూట అధిక మోతాదులో తినడం మంచిది కాదు. పుచ్చకాయను కోసే ముందు దాని పైభాగాన్ని శుభ్రంగా కడగాలి. బయట భాగంలో ఉన్న దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కత్తి ద్వారా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ్రమైన కత్తి, కటింగ్ బోర్డ్ ఉపయోగించడం అవసరం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image2
Pregnancy Calculation: పెళ్లై నెల.. కానీ నెలన్నర ప్రెగ్నెన్సీ .. ఇది సాధ్యమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved