- Home
- Life
- Woman
- Grey Hair: కలర్స్ తో పనిలేదు.. పెరుగులో ఇది కలిపి రాసినా తెల్ల వెంట్రుకలు మళ్లీ నల్లగా మారతాయి
Grey Hair: కలర్స్ తో పనిలేదు.. పెరుగులో ఇది కలిపి రాసినా తెల్ల వెంట్రుకలు మళ్లీ నల్లగా మారతాయి
Grey Hair: ఈరోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దానిని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే డై లు వాడే అవసరం లేకుండా.. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
15

Image Credit : Pinterest
తెల్ల జుట్టు...
30 ఏళ్లు కూడా నిండకముందే తెల్ల జుట్టు వచ్చేస్తోందా? వయసుకు మించిన వారిలా కనిపిస్తున్నాం అని, వాటిని కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే ఏవేవో ఆయిల్స్, హెయిర్ డైలు వాడుతూ ఉంటారు. కానీ, వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఆ కెమికల్స్ తో పని లేకుండా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మరీ ముఖ్యంగా మన కిచెన్ లో లభించే రెండు పదార్థాలతో ఇది సాధ్యం అవుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Add Asianetnews Telugu as a Preferred Source

25
Image Credit : Getty
తెల్ల జుట్టు రావడానికి కారణాలు..
దుమ్ము, ధూళి, కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, పోషకాల లోపం.. ఇలాంటి కారణాల వల్ల ఈ మధ్య చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని దాచుకోవడానికి మార్కెట్లో దొరికే హెయిర్ డైలు వాడుతుంటారు. కానీ ఇవి అప్పటికప్పుడు జుట్టును నల్లగా మార్చినా, భవిష్యత్తులో మిగతా జుట్టును కూడా తెల్లగా మార్చేస్తాయి.
35
Image Credit : Getty
కరివేపాకు..
అందుకే మన పూర్వీకులు వాడిన ఈ చిట్కాతో కొన్ని రోజుల్లోనే మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అవును, ఆరోగ్యకరమైన జుట్టు కోసం మన పెద్దలు ఎప్పటినుంచో కరివేపాకు, పెరుగు వాడుతున్నారు. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ రెండూ అద్భుతంగా పనిచేస్తాయి.
45
Image Credit : Getty
కరివేపాకు, పెరుగు హెయిర్ ప్యాక్..
కరివేపాకు వాడటం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. కరివేపాకులోని పోషకాలు తెల్ల జుట్టును కుదుళ్ల నుంచి నల్లగా మార్చడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అందుకే కరివేపాకు, పెరుగు కలిపిన హెయిర్ కలర్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
55
Image Credit : social media
ఎలా వాడాలి?
దీనికోసం ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి, మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, గంట తర్వాత గోరువెచ్చని నీటితో, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు త్వరగా నల్లగా మారుతుంది.
Latest Videos

