MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Dry Fish vs Fresh Fish: ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

Dry Fish vs Fresh Fish: ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ఎండు చేపలు తినడం మంచిదా? పచ్చి చేపలు తినడం మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 30 2026, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఏది బెస్ట్?
Image Credit : stockPhoto

ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఏది బెస్ట్?

ఎండు చేపలు, పచ్చి చేపలు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం తాజా చేపల్లో సహజమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెసింగ్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు పచ్చి చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తాజా చేపలు తక్కువ ఉప్పు కలిగి ఉండటం వల్ల రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత సురక్షితమైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎండు చేపలు తింటే?
Image Credit : our own

ఎండు చేపలు తింటే?

ఇక ఎండుచేప విషయానికి వస్తే, ఇవి కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. చేపలోని నీటిని పూర్తిగా తొలగించడం వల్ల అందులోని ప్రోటీన్, ఖనిజాలు మరింత సాంధ్రతతో ఉంటాయి. అంటే కొద్దిపాటి ఎండుచేపలు తిన్నా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఇందులో బాగా ఉంటాయి. అయితే చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల సోడియం స్థాయి అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

36
హానికరమైన రసాయనాలు
Image Credit : stockPhoto

హానికరమైన రసాయనాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎండుచేపల్లో కొన్ని సందర్భాల్లో హానికరమైన రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగించవచ్చు. అంతేకాకుండా సరైన పరిశుభ్రత లేకుండా తయారు చేసిన ఎండుచేపల్లో బ్యాక్టీరియా, పారా‌సైట్స్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ఉండే ప్రమాదం ఉంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.

46
వీరు తినకపోవడం మంచిది
Image Credit : stockPhoto

వీరు తినకపోవడం మంచిది

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండుచేపల్లో మెర్క్యురీ వంటి లోహాల స్థాయిలు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా పెద్ద చేపలను ఎండబెట్టినప్పుడు ఈ లోహాలు మరింత కేంద్రీకృతమవుతాయి. ఇవి గర్భిణీలు, పిల్లలకు ప్రమాదకరం. అలాగే ఎండబెట్టే ప్రక్రియలో నీటిలో కరికే విటమిన్లు కూడా తగ్గే అవకాశం ఉంది.

56
ఈ జాగ్రత్తలు అవసరం
Image Credit : stockPhoto

ఈ జాగ్రత్తలు అవసరం

పచ్చి చేపల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. తాజా చేపలు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. లేకపోతే వాటిపై బ్యాక్టీరియా చేరి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. సరైన విధంగా నిల్వ చేసి, తాజాగా వండుకొని తింటే తాజా చేపలు ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.

66
చేపలను రెగ్యులర్ గా తింటే?
Image Credit : stockPhoto

చేపలను రెగ్యులర్ గా తింటే?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, రోజువారీ ఆహారంలో తాజా చేపలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అలాగనీ ఎండుచేపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎండుచేపలను తగ్గించడం మంచిది. ఎండుచేప వండేటప్పుడు ముందుగా నీటిలో నానబెట్టి ఉప్పును తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Plant Care: ఎండాకాలంలో మొక్కలు పచ్చగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
Recommended image2
Curry Leaves: రోజూ కరివేపాకు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved