Health Tips: పదే పదే తినాలనిపిస్తుందా? ఆకలిని నియంత్రించే చిట్కాలు!
Control Overeating: కొంతమందికి ఎప్పుడూ ఆకలి అవుతూనే ఉంటుంది. దీంతో వారు సమయం, సందర్భం లేకుండా ఏదొకటి తింటునే ఉంటారు. దీని కారణంగా అధిక బరువు పెరగడం, ఉబకాయం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారి ఆకలిని అదుపు చేసే చిట్కాలు మీకోసం..

ఆకలి నియంత్రణ
ఆకలి నియంత్రణ అనేది సాధ్యమైనదే. సహజమైన మార్గాల్లో ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం ద్వారా, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి చిన్న మార్పులే అయినా, దీర్ఘకాలంలో ఇది మంచి ఫలితాలను ఇస్తాయి. అదేలానో తెలుసుకుందాం.
గుడ్డు
గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, అనేక ముఖ్యమైన విటమిన్లు, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ శక్తినిస్తాయి. కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. ఉడికించిన గుడ్డు లేదా కొన్ని కూరగాయలతో బరువైన ఆమ్లెట్ తయారు చేసుకుని కూడా తినవచ్చు. లేదా హాఫ్ బాయిల్ లేదా పోచ్‌గా కూడా తినవచ్చు. అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండి, ఈ రుచికరమైన ఆరోగ్యకర ఆహారాన్ని తినండి.
పండ్లు
తరుచు ఆకలిగా అనిపిస్తే.. ఏదొకటి తినకుండా.. ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని తీసుకోండి. అలాంటి ఆహారంలో ఆపిల్ బెస్ట్ ఛాయిస్. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. ఆపిల్, బేరి, పుచ్చకాయ వంటి పండ్ల చాట్ లేదా పండ్లు, పెరుగుతో రైతా తయారు చేసుకుని స్నాక్స్‌గా తినవచ్చు. ఇలాంటి ఆహారం తింటే.. స్వీట్లు లేదా రుచికరమైన ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది.
ఓట్స్
ఓట్స్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. కూరగాయలు, మసాలా దినుసులతో ఓట్స్ ఖిచడీ, లేదా పండ్లు, పెరుగు కలిపి ఓట్స్ స్మూతీ వంటివి నచ్చిన విధంగా తయారు చేసుకుని తినవచ్చు.
మిల్క్ షేక్
మిల్క్ షేక్ తయారీ కోసం.. పాలు, ఐస్ క్రీమ్ కలిపి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత రుచి కోసం పండ్లు, చాక్లెట్ సిరప్ లేదా ఇతర పదార్థాలను యాడ్ చేసుకోండి. కూలింగ్ కోసం ఐస్ ముక్కలను యాడ్ చేసుకోవచ్చు. ఇది తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి పోషకాలను అందిస్తుంది.