MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త

ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త

ఒకప్పటి స్నాక్స్ ఆరోగ్యకరం, శక్తినిచ్చేవి. కానీ నేటి స్నాక్స్ అనారోగ్యకరం. మల్టీ బిలియన్ జంక్ ఫుడ్ ఇండస్ట్రీకి మన పిల్లల ఆరోగ్యం కంటే వారి వార్షిక లాభాలే ముఖ్యం. 

2 Min read
Author : Amarnath Vasireddy
Published : Apr 07 2026, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాల్య రుచులే జీవితాంతం ఇష్టమైన రుచులు..
Image Credit : Getty

బాల్య రుచులే జీవితాంతం ఇష్టమైన రుచులు..

“మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? ” అని ఎవరినైనా అడిగితే.. మనసు క్షణం కూడా ఆలోచించకుండా తక్షణమే ఒక జవాబు చెబుతుంది. ఆ జవాబు కేవలం ఒక రుచి మాత్రమే కాదు, అది మన బాల్యపు జ్ఞాపకాల లోతుల్లో నుంచి పెల్లుబికిన భావోద్వేగం. ఎందుకంటే బాల్యంలో అలవాటైన రుచే.. జీవితాంతం ఇష్టమైన రుచిగా మిగిలిపోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక శాస్త్రీయ సత్యం. మన *సబ్‌కాన్షియస్ మైండ్* (ఉపచేతన మనస్సు)లో చిన్నప్పుడు నాటుకున్న రుచులు మన ప్రవర్తనను శాసిస్తాయి. అందుకే “అలవాటు అనేది రెండో స్వభావం” అంటారు.

25
క్యాచ్ దెమ్ యంగ్ (Catch them young) అంటే ఏమిటి..?
Image Credit : Getty

క్యాచ్ దెమ్ యంగ్ (Catch them young) అంటే ఏమిటి..?

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ మల్టీ-బిలియన్ డాలర్ జంక్ ఫుడ్ పరిశ్రమ మన పిల్లల మనస్తత్వాన్ని, వారి ఇష్టాఇష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. వాణిజ్య ప్రకటనల భాషలో దీనిని “క్యాచ్ దెమ్ యంగ్” స్ట్రాటజీ అంటారు. అంటే ఒక బిడ్డకు రుచి మొగ్గలు (Taste buds) వికసించే దశలోనే తమ ఉత్పత్తులను అలవాటు చేయడం. తద్వారా వారు జీవితాంతం తమ బ్రాండ్‌కు బానిసలుగా ఉండేలా చూసుకోవడం.

Related Articles

Related image1
Now Playing
AP Food Commission: రైస్ ముద్దవుతుంది.. ఇడ్లీ చట్నీలో నీరెక్కువ | Madhurawada | Asianet News Telugu
Related image2
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
35
రంగుల వెనుక విషం..
Image Credit : Getty

రంగుల వెనుక విషం..

పిల్లలు సహజంగానే ఆకర్షణీయమైన రంగులు, వింత ఆకృతులు, నోట్లో వేస్తే కరకరలాడే (Crunchy) పదార్థాల పట్ల మొగ్గు చూపుతారు. పరిశ్రమలు ఇదే సూత్రాన్ని వాడుకుంటున్నాయి.

ఆకర్షణీయమైన ప్యాకింగ్ : రంగురంగుల కవర్లు, కార్టూన్ బొమ్మలతో పిల్లలను బురిడీ కొట్టిస్తారు.

బ్లిస్ పాయింట్ (Bliss Point) : ఆహార శాస్త్రవేత్తలు చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో కలిపి ‘బ్లిస్ పాయింట్’ను సృష్టిస్తారు. ఇది మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేసి, ఆ ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తినాలనే బలమైన కోరికను (Addiction) కలిగిస్తుంది.

అడిటివ్స్ ఆండ్ ప్రిజర్వేటివ్స్ : కేవలం రుచి కోసం వాడే ఎం.ఎస్.జి (MSG), అధిక మోతాదులో ఉండే సోడియం పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

45
సంప్రదాయం vs సౌకర్యం
Image Credit : Getty

సంప్రదాయం vs సౌకర్యం

ఒకప్పుడు మన స్నాక్స్ అంటే అమ్మమ్మ చేతి అరిసెలు, జంతికలు, తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు, వేరుశనగ ముద్దలు. అవి కేవలం ఆహారం మాత్రమే కాదు పోషకాల గనులు. కానీ నేడు మనం ‘సౌకర్యం’ (Convenience) పేరుతో సూపర్ మార్కెట్లలో లభించే ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లకు ఆకర్షితులై ప్యాకెట్లలోని విషాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఫలితంగా నేటి తరం పిల్లలు అతి చిన్న వయసులోనే ఊబకాయం (Obesity), మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు.

55
మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది..!
Image Credit : FREEPIK

మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది..!

ఈ మల్టీ-బిలియన్ జంక్ ఫుడ్ ఇండస్ట్రీకి మన పిల్లల ఆరోగ్యం కంటే వారి వార్షిక లాభాలే ముఖ్యం. మనం పిల్లలకు ఇస్తున్నది శక్తినిచ్చే ఆహారమా లేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే అలవాటా? అని ఒక్కసారి ఆలోచించాలి.

మార్పు మనతోనే మొదలవ్వాలి : ఇంట్లో చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు, సజ్జలు) వాడకం పెంచాలి.

అవగాహన : ప్రకటనల మాయలో పడకుండా, ప్యాకెట్ వెనుక ఉండే ‘న్యూట్రిషన్ లేబుల్’ చదవడం అలవాటు చేసుకోవాలి.

సహజ ఆహారం : ప్రాసెస్ చేసిన ఆహారం కంటే ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

నేడు మనం మార్చుకునే ఒక చిన్న అలవాటు.. రేపటి తరం ఆరోగ్యానికి ఒక పెద్ద వరం అవుతుంది.

By

suneetha. Principal. Slate the school. Bowrampet

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
ఆహారం
చిన్నారుల సంరక్షణ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Stress Relief foods: ఒత్తిడిని తగ్గించే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో!
Recommended image2
Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?
Recommended image3
Water Bottle : బయట దొరికే వాటర్ బాటిల్స్ లో నీరు మంచివేనా..? కొనేముందే ఇలా చెక్ చేసుకొండి
Related Stories
Recommended image1
Now Playing
AP Food Commission: రైస్ ముద్దవుతుంది.. ఇడ్లీ చట్నీలో నీరెక్కువ | Madhurawada | Asianet News Telugu
Recommended image2
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved