MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Junk Food: జంక్ ఫుడ్ ప్రతిరోజూ తినేవారు ఎంతోమంది. మనకు తెలియకుండానే జంక్ ఫుడ్ ను అధికంగా తినేస్తాము. ఒక 60 పాటు కూల్ డ్రింకులు, మసాలా పదార్థాలు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానేయండి. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 05 2026, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జంక్ ఫుడ్ తినడం మానేస్తే
Image Credit : Getty

జంక్ ఫుడ్ తినడం మానేస్తే

ఈరోజుల్లో ఆకలి వేస్తే చాలు.. జంక్ ఫుడ్ వైపే పరుగులు తీస్తున్నాం. వేడివేడిగా నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లే, చికెన్ బర్గర్లు, పిజ్జాలు, కూల్డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాము. ఇలా ఇప్పటి యువత జంక్ ఫుడ్ కు బానిసలు అయిపోయారు. నిజానికి ఇది పొట్ట నింపుతున్నట్టు అనిపిస్తున్నా మన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అందుకే ఒక 60 రోజులు పాటు జంక్ ఫుడ్ కు పూర్తిగా దూరంగా ఉండి చూడండి. మీ మానసిక, శారీరక ఆరోగ్యంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో గమనించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బరువు త్వరగా పెరిగిపోతారు
Image Credit : Getty

బరువు త్వరగా పెరిగిపోతారు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం జంక్ ఫుడ్ లో క్యాలరీలు, పోషకాలు ఉన్నప్పటికీ.. అతిగా ప్రాసెస్ చేసేనే ఆహారాలు శరీరానికి కీడే చేస్తాయి. బరువు త్వరగా పెంచేస్తాయి. జంక్ ఫుడ్స్ అనేవి ప్రజల్లో తినాలన్న కోరికను పెంచుతాయి. దీనివల్ల అధికంగా తినేస్తారు. 60 రోజులు పాటు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల లెప్టిన్, గ్రెలిన్ వంటి ఆకలి ఆ హార్మోన్లు రీసెట్ అవుతాయి. త్వరగా పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని కోరికను పెంచుతాయి.

34
ఈ లాభాలు కలుగుతాయి
Image Credit : Getty

ఈ లాభాలు కలుగుతాయి

ఒబేసిటీ సైన్స్ అండ్ ప్రాక్టీస్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం జంక్ ఫుడ్ అధికంగా తినే వారితో పోలిస్తే.. తక్కువగా తినేవారు తక్కువ క్యాలరీలను పొందుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల వారు బరువు కూడా పెరగడం లేదు. 60 రోజులు పాటు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే కొవ్వు కరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. రోజంతా మీరు శక్తివంతంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. పేగుల సమస్యలు కూడా తీరిపోతాయి. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.

44
ఎన్నో రకాల వ్యాధులు రావు
Image Credit : Getty

ఎన్నో రకాల వ్యాధులు రావు

పరిశోధనలు చెబుతున్న ప్రకారం 2026లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం జంక్ ఫుడ్ వల్ల రోజువారీ క్యాలరీలు 15 శాతం వరకు తగ్గుతాయి. దీని వల్ల సాధారణంగా మీరు బరువు తగ్గిపోతారు. పండ్లు, కూరగాయలతో చేసిన ఇంట్లో వండి ఆహారాన్ని మాత్రమే తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఒక రెండు నెలల పాటు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించి ఆ ఫలితాలను చూడండి. మీలోనే ఎంతో మార్పు వస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Washing Machine Hacks: వాషింగ్ మెషీన్ లో ఇవి వేస్తే బట్టలు ముడతలే పడవు
Recommended image2
Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్
Recommended image3
Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu: వల్లి లేకుండా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలే లేదు, నల్ల పిల్ల అన్నవాళ్లే మెచ్చుకుంటున్నారు
Recommended image2
Palmistry: మీ అరచేతిలో ఈ గుర్తులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved