MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Cardamom Water Benefits: రోజూ ఉదయాన్నే యాలకులు నానబెట్టిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Cardamom Water Benefits: రోజూ ఉదయాన్నే యాలకులు నానబెట్టిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

యాలకులు వంటలకు రుచి, సువాసన పెంచుతాయి. వాటిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతి రోజూ యాలకులు నానబెట్టిన నీళ్లను తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : Jun 27 2025, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Health benefits of drinking cardamom water
Image Credit : stockPhoto

Health benefits of drinking cardamom water

నిపుణుల ప్రకారం యాలకుల నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాలకులను వేడి నీటిలో నానబెట్టి తాగితే చాలా లాభాలు కలుగుతాయి. యాలకుల నీళ్లు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను, కడుపు నొప్పిని తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారించడంలో కూడా ఈ వాటర్ బాగా సహాయపడతాయి.  

25
నోటి ఆరోగ్యానికి..
Image Credit : stockPhoto

నోటి ఆరోగ్యానికి..

యాలకులలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇది సహజ మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది. రోజూ రెండు యాలకులు నమిలి తింటే నోరు తాజాగా ఉంటుంది. అంతేకాదు ఇవి శరీరంలోని విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపి.. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Related Articles

Related image1
Garlic Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Related image2
Green Cardamom: రోజూ రాత్రి పడుకునే ముందు 2 యాలకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
35
చర్మ ఆరోగ్యానికి..
Image Credit : Asianet News

చర్మ ఆరోగ్యానికి..

యాలకుల నీరు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని పొటాషియం, ఇతర ఖనిజాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటును తగ్గిస్తాయి. జలుబు, దగ్గు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో యాలకులు సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

45
మానసిక ఒత్తిడి తగ్గుతుంది!
Image Credit : stockPhoto

మానసిక ఒత్తిడి తగ్గుతుంది!

యాలకులకు మనసును ప్రశాంతపరిచే గుణాలున్నాయి. యాలకుల నీళ్లు తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. యాలకుల నీళ్లు జీవక్రియను పెంచుతాయి. అంతేకాదు యాలకుల నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.  

55
యాలకుల నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి?
Image Credit : Asianet News

యాలకుల నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి?

1-2 యాలకులను తీసుకుని పై తొక్క తీసి లోపలి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం లేవగానే ఈ నీళ్లను అలాగే తాగవచ్చు లేదా గింజలు తీసేసి తాగవచ్చు. యాలకుల పొడి వాడితే, గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు యాలకుల నీళ్లు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: సమ్మర్ హెయిర్ కేర్‌కు సొల్యూషన్..అవకాడోతో బెస్ట్ రిజల్ట్
Recommended image2
Testosterone: యువకుల్లోనే టెస్టోస్టెరాన్ సమస్య..ఎందుకంటే?
Recommended image3
Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..
Related Stories
Recommended image1
Garlic Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Green Cardamom: రోజూ రాత్రి పడుకునే ముందు 2 యాలకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved