MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..

Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..

వేసవిలో దుస్తుల ఎంపికలో మార్పు అవసరం. వేడి, చెమట, అసౌకర్యం అన్నీ కలిసి రోజూవారీ జీవితాన్ని కాస్త కష్టంగా మార్చేస్తాయి. అందుకే చాలామంది కాటన్ దుస్తుల వైపు మొగ్గు చూపుతారు. కానీ కాటన్ కాకుండా సమ్మర్‌లో ఇంకేం దుస్తులు వేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 24 2026, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Summer Clothing Ideas
Image Credit : pinterest

Summer Clothing Ideas

సమ్మర్ అంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది కాటన్ దుస్తులే. నిజానికి కాటన్ చల్లగా, సౌకర్యంగా ఉండే ఫ్యాబ్రిక్ అయినా, అదొక్కటే ఆప్షన్ కాదు. వేసవి కాలంలో స్టైల్, కంఫర్ట్ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే ఇతర ఫ్యాబ్రిక్స్ గురించి కూడా తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా చెమట ఎక్కువగా వచ్చేవారు లేదా రోజంతా బయట తిరిగేవారికి కాటన్‌తో పాటు మరికొన్ని మెటీరియల్స్ మరింత సౌకర్యాన్ని ఇస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
లినెన్ ఫ్యాబ్రిక్
Image Credit : pinterest

లినెన్ ఫ్యాబ్రిక్

లినెన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్‌గా ఉండటమే కాకుండా గాలి సులభంగా వెళ్లేలా చేస్తుంది. కాటన్ కంటే కొంచెం క్రిస్ప్ లుక్ ఇస్తుంది కాబట్టి ఆఫీస్ వేర్‌కి బాగా సరిపోతుంది. అలాగే చెమట త్వరగా ఆరిపోవడం వల్ల ఎక్కువసేపు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే లినెన్ తేలికగా మడతలు పడే ఫ్యాబ్రిక్ కావడంతో కొంతమందికి అది మైనస్‌గా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మిక్స్‌డ్ లినెన్ ఫ్యాబ్రిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

37
రేయాన్ లేదా విస్కోస్
Image Credit : theloom.in

రేయాన్ లేదా విస్కోస్

ఈ ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌గా, సిల్కీ ఫీల్ ఇస్తుంది. కానీ కాటన్‌లా హీట్ ట్రాప్ చేయవు. ముఖ్యంగా ఫ్లోయీ డ్రెస్సులు, కుర్తీలు లేదా టాప్స్‌ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇవి శరీరానికి అంటుకోకుండా కాస్త లూజ్‌గా ఉంటాయి కాబట్టి, గాలి సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అలాగే ట్రావెల్ సమయంలో ఇవి సౌకర్యంగా ఉంటాయి.

47
మోడల్ ఫ్యాబ్రిక్
Image Credit : pinterest

మోడల్ ఫ్యాబ్రిక్

చాలామందికి తెలియని మరో మంచి ఎంపిక మోడల్ ఫ్యాబ్రిక్. ఇది సహజ వనరుల నుంచి తయారయ్యే సెమీ-సింథటిక్ మెటీరియల్. ఇది చాలా మృదువుగా ఉండటమే కాకుండా చెమటను బాగా శోషిస్తుంది. వేసవిలో దీన్ని ధరించడం వల్ల చర్మానికి ఇబ్బంది ఉండదు. బాగా స్ట్రెచ్ కూడా అవుతుంది.

57
బాంబూ ఫ్యాబ్రిక్
Image Credit : instagram @_aaradhy_enterprises

బాంబూ ఫ్యాబ్రిక్

బాంబూ ఫ్యాబ్రిక్ ని కూడా ఈ మధ్య కాలంలో చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది సహజంగా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. చెమట వాసన తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి.. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి మంచి ఆప్షన్.

67
పాలిస్టర్ దుస్తులు
Image Credit : Asianet News

పాలిస్టర్ దుస్తులు

చాలా మంది పాలిస్టర్ వేసవిలో అసౌకర్యంగా ఉంటుందని అనుకుంటారు. అది పూర్తిగా నిజం కాదు. హేవీ పాలిస్టర్ కాకుండా, లైట్ వెయిట్ లేదా మాయిశ్చర్ వికింగ్ పాలిస్టర్ దుస్తులు ధరించడం వల్ల చెమట త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్ లేదా వర్కౌట్ కోసం ఇవి చాలా ఉపయోగకరం.

77
దుస్తుల డిజైన్
Image Credit : pinterest

దుస్తుల డిజైన్

ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు, దుస్తుల డిజైన్ కూడా చాలా ముఖ్యం. లూజ్ ఫిట్, లైట్ కలర్స్, సింపుల్ కట్స్ వేసుకోవడం వల్ల శరీరానికి వేడి తక్కువగా అనిపిస్తుంది. టైట్ ఫిట్ లేదా డార్క్ కలర్స్ వేడి ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి వీటిని తగ్గించడం మంచిది. అలాగే స్లీవ్‌లెస్ లేదా షార్ట్ స్లీవ్స్ దుస్తులు వేసుకోవడం ద్వారా గాలి బాగా ఆడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఫ్యాషన్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Summer Skincare Tips: ఎండలో తిరిగినా ముఖం ఫ్రెష్ గా, బ్రైట్ గా ఉండాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!
Recommended image2
Summer Face Packs: వేసవిలో మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved