20 ఏళ్లు వచ్చినా గడ్డం, మీసం రావడం లేదా? కారణాలు ఏంటి, ఏం చేయాలి?
Beard Growth Science: శరీరంలో జరిగే ప్రతీ మార్పునకు ఒక సైంటిఫిక్ కారణం ఉంటుందని సైన్స్ చెబుతుంది. అలాంటిదే గడ్డం, మీసాలు కూడా. అయితే కొంతమంది పురుషుల్లో మాత్రం గడ్డం, మీసం సరిగ్గా కనిపించదు. దీనికి గల కారణాలేంటంటే..

గడ్డం ఒక స్టైల్
ఒకప్పుడు గడ్డం పెంచుతూ తిరిగే వారిని జులాయిగా చూసేవారు. కానీ ప్రస్తుతం గడ్డం పెంచుకోవడం ఒక ట్రెండ్‌లా మారింది. గడ్డం, మీసాల కోసం ప్రత్యేకంగా షాంపూలు, ఆయిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కొందరిలో మాత్రం వయసు పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో గడ్డం, మీసాలు కనిపించవు. దీనికి అసలు కారణం ఏంటంటే.?
KNOW
హార్మోన్ల ప్రభావమే
గడ్డాలు, మీసాలు రాకపోవడానికి జీన్స్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అదే విధంగా కొందరు పురుషుల్లో టెస్టో స్టిరాన్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావు. అలాంటి వారిలో కూడా గడ్డం, మీసం పెరుగుదల సరిగ్గా ఉండదు. మరికొంత మందిలో న్యూట్రిషియన్ లోపం కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి వారిలో గడ్డం, మీసం పూర్తిగా రాకపోవడం లేదా గుబురుగా ఉండకపోవచ్చు.
పరిష్కారం ఏంటి.?
గడ్డాలు, మీసాలు బాగా రావాలంటే సదరు వ్యక్తికి సరిపడ టెస్టోస్టిరాన్ హార్మోన్ లభించాలి. ఈ హార్మోన్ లభించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే శారీరకంగా కూడా చాలా యాక్టివ్‌గా ఉండాలి. అందుకే చిన్నారులను శారీరక క్రీడలు ఆడేలా ప్రోత్సహించాలి. ప్రస్తుత ఆధునిక వైద్య విధానంలో గడ్డం పెరిగే ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే సహజ విధానాలు పాటించడమే ఉత్తమం.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి..
(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)