Skincare Tips: అరటి తొక్కలను పారేయకండి.. ఇలా వాడితే మెరిసే చర్మం మీ సొంతం!
Skincare Tips: అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేస్తాం కదా. కానీ, ఇక ముందు అరటి తొక్కే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎలా వాడాలో ఆ వివరాలు చూద్దాం.

అరటి తొక్కలను పారేయకండి
అందంగా, యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ క్రమంలో చర్మ సౌందర్యం, సంరక్షణ కోసం రకరకాల మెడిసిన్, పదార్థాలు వాడతారు. అలాగే.. చర్మ రక్షణకు వంటింట్లో ఉండే పదార్థాలే ఉపయోగపడతాయి. వాటిలో అరటి పండు తొక్కలు ఒక్కటి.
ఆరోగ్యవంతమైన చర్మం
అరటి పండే కాదు.. వాటి తొక్కలు మన చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఇందులో మన చర్మానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం రోజూ అరటిపండు తొక్కలను మన డైలీ రోటిన్ లో చేర్చుకోవడం వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చు.
మాయిశ్చరైజర్‌లా..
అరటి తొక్కల్లో ఉండే తేమ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది సహజమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఈ తొక్కలను చర్మానికి రాసుకోవడం వల్ల మృదువుగా మారుతుంది.
మృత కణాల్ని తొలగిస్తుంది
అరటి తొక్కలు.. మన చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ అందిస్తాయి. చర్మంపై ఉండే మృత కణాల్ని తొలగించే ప్రక్రియ. తొక్కలను చర్మం మీద రాసుకోవడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం మృదువుగా మరింత మెరుస్తుంది.
మొటిమల నివారిణి
అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు, వాటి బాధ నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే.. మంటను తగ్గించి, చికాకుగా ఉన్న చర్మానికి ఉపశమనం అందిస్తుంది.
యవ్వనంగా కనిపించేలా..
అరటి తొక్కలు యాంటీ ఏజింగ్ ఆర్సెనల్‌కు సహాయపడుతుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. ఇది చర్మంపై గీతలు, ముడతలు తగ్గించి యవ్వవంగా మార్చుతుంది.
చర్మం మెరిసేందుకు..
అరటిపండు తొక్కలలో ఉండే ఎంజైమ్‌లు హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను పరిష్కరిస్తాయి. చర్మంపై తొక్కల్ని రెగ్యులర్‌గా అప్లై చేస్తే.. ప్రకాశంగా కనిపించి మెరుస్తుంది.