Banana: అరటిపండుతో పాటుగా ఈ పండును ఎట్టి పరిస్థితిలో తినకండి.. లేదంటే..?
Banana: అరటిపండుతో పాటుగా బొప్పాయి పండును తింటే.. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, అజీర్థి , అలెర్జీ, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..

Banana: అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా ఈ పండంటే ఇష్టపడని వారుండరేమో. ప్రతి రోజూ ఒక్క అరటిపండు తిన్నా.. మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతుంటారు.
అయితే ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండుతో పాటుగా కొన్ని రకాల పండ్లను కలుపుకుని అస్సలు తినకూడదు. అలా తింటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నిత్యం ఒక అరటిపండు తిన్నా.. గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇకపోతే బొప్పాయి పండును నిత్యం తింటే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుందని మనకు తెలుసు. అలాగే ఈ పండు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. ఈ రెండు పండ్లు మన ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా.. వీటిని కలిపి అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో తింటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.
ఆయుర్వేదం ప్రకారం.. ఈ రెండు పండ్లను ఎట్టిపరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే ఈ రెండు పండ్లు వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నాయి. అంటే బొప్పాయి పండు వేడి స్వభావం కలిగుంటే.. అరటి చలువ చేసే స్వభావం కలిగి ఉంటుంది.
ఈ రెండింటి కాంబినేషన్ లో తింటే మాత్రం జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, అలెర్జీ, అసిడిటీ వంటి సమస్యల బారిన పడతారు.
ఇక గర్భంతో ఉన్నవారు బొప్పాయి పండ్లను మొత్తమే తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండు శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుంది. దీంతో పిండం దెబ్బతినే అవకాశం ఉంది.
శ్వాసకోస సమస్యలు లేదా, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతున్నవాళ్లు బొప్పాయి పండును తింటే ఈ సమస్య మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే దురద, ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమస్యలున్న వారు బొప్పాయి తినాలనుకుంటే వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోండి.
బొప్పాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. అలా అని పీచుపదార్థం ఎక్కువగా తీసుకున్నా.. మలబద్దకం సమస్య వస్తుంది జాగ్రత్త.. ఏదేమైనా అరటిపండును, బొప్పాయి పండును కలిపి మాత్రం తినకండి. దీనివల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యలు వస్తాయి.