Banana: పచ్చి అరటి vs పండిన అరటి.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?
అన్ని కాలాల్లో దొరికే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది. చిన్నా, పెద్దా అందరు అరటి పండును ఇష్టంగా తింటారు. రోజుకో అరటి పండు తింటే చాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, అరటి.. పచ్చిగా ఉన్నప్పుడు తింటే మంచిదా? పండుగా తింటే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా అరటి పండును అందరు ఇష్టంగా తింటారు. అందుబాటు ధరలో దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటి.. పచ్చిగా ఉన్నప్పుడు తింటే మంచిదా? పండిన తర్వాత తింటే మంచిదా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
అరటి పండు పచ్చిగా ఉన్నా, పండినా రెండూ ఆరోగ్యానికి మంచివేనట. పండిన అరటి సులభంగా జీర్ణమవుతుంది. కానీ పచ్చి అరటి మధుమేహం ఉన్నవాళ్లకి మంచిది. కాలేయానికి కూడా మేలు చేస్తుంది. అయితే ఏ అరటిలో పోషకాలు ఎక్కువ, ఏది ఎక్కువ ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి ఆరోగ్య ప్రయోజనాలు
ఎక్కువగా తినే పండ్లల్లో అరటి పండు ఒకటి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి అరటిని ఉపయోగిస్తుంటారు. ఆకలి వేస్తే పండిన అరటి, కడుపు నొప్పిగా ఉంటే పచ్చి అరటి తింటుంటారు. అరటి పండు చాలా ఆరోగ్య సమస్యలకి నివారణగా పనిచేస్తుంది. తక్కువ ధరకే లభిస్తుంది. అరటిలో చాలా పోషకాలు ఉంటాయి. పండిన, పచ్చి అరటి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.
పండు అరటి ప్రయోజనాలు
అరటి పండు మార్కెట్లో లేదా బయట సులభంగా దొరుకుతుంది. దీన్ని వేల మంది ఆహారంగా తీసుకుంటారు. ఎక్కువ మంది మధ్యాహ్న భోజన ఖర్చు తగ్గించుకోవడానికి అరటి పండు తింటారట. ఇది చవకగా దొరకడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది కావడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పండిన అరటి సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పండు అరటితో నష్టాలు
పండిన అరటి పండు కొన్ని పరిస్థితుల్లో హానికరమని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఇది హానికరమని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి అరటి ప్రయోజనాలు
- పచ్చి అరటిని సాధారణంగా కూరగాయగా ఉపయోగిస్తారు. పచ్చి అరటికాయ వేపుడు లేదా కూరగాయల రూపంలో వాడుతారు. ఇది రుచికి వగరుగా ఉంటుంది.
- పచ్చి అరటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా పచ్చి అరటి కాయ తినవచ్చు.ఇది కాలేయానికి కూడా మంచిది. ఇందులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది.
ఔషధంగా పచ్చి అరటి..
- గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పచ్చి అరటిని ఔషధంగా ఉపయోగిస్తారు. కడుపు నొప్పిగా ఉంటే మందులు వేసుకునే ముందు ఈ అరటి పండు తింటారు.
- పచ్చి అరటి కాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరైన మోతాదులో తినడం మంచిది.