MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • Curd: పెరుగు ఈ సమయంలో అస్సలు తినొద్దు.. ఎందుకంటే?

Curd: పెరుగు ఈ సమయంలో అస్సలు తినొద్దు.. ఎందుకంటే?

Curd : చాలా మందికి అన్నం తినేటప్పుడు చివర్లో ఒక్క ముద్దైనా పెరుగుతో తినడం అలవాటు. పెరుగు రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు పెరుగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  అవేంటంటే..

1 Min read
Author : Rajesh K
Published : Jul 01 2025, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాత్రి సమయంలో
Image Credit : stockPhoto

రాత్రి సమయంలో

ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. ఎందుకంటే.. రాత్రిళ్ళు జీర్ణక్రియ మందగిస్తుంది.  జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. దీని వల్ల గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అందుకే రాత్రి పెరుగు తినకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ కాలంలో పెరుగుకు దూరంగా..
Image Credit : stockPhoto

ఈ కాలంలో పెరుగుకు దూరంగా..

చలికాలం, వర్షాకాలంలో శరీరం చల్లగా ఉంటుంది.  జీర్ణశక్తి మందగిస్తుంది. పెరుగు చల్లని స్వభావం కలిగి ఉండటంతో జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ కాలంలో పెరుగు తినకపోవడం ఉత్తమం. తినాలంటే మిరియాలు, అల్లం, జీలకర్ర వంటి తాపగుణాలు కలిగిన పదార్థాలతో  కలిపి తినవచ్చు. 

36
జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు
Image Credit : stockPhoto

జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు

అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యల సమయంలో పెరుగు తినకూడదు. ఇది సులభంగా జీర్ణం కాక, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మజ్జిగ లేదా అల్లం నీరు వంటి పానీయాలు మంచివి.

46
చర్మ సమస్యలు ఉంటే..
Image Credit : stockPhoto

చర్మ సమస్యలు ఉంటే..

చర్మ సమస్యలు, దురద, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు. పెరుగులోని కొన్ని పదార్థాలు ఈ సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. పాల ఉత్పత్తుల వల్ల అలెర్జీ వచ్చేవారు పెరుగు తినకపోవడమే మంచిది.

56
 రక్త సంబంధిత సమస్యలు
Image Credit : stockPhoto

రక్త సంబంధిత సమస్యలు

ఆయుర్వేదం ప్రకారం.. రక్తస్రావం లేదా ఇతర రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు. ఎందుకంటే పెరుగు రక్తాన్ని గడ్డకట్టే స్వభావం కలిగి ఉందని కొన్ని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

66
పెరుగుకు బదులుగా
Image Credit : stockPhoto

పెరుగుకు బదులుగా

పెరుగుకు మంచి ప్రత్యామ్నాయం మజ్జిగ. మజ్జిగ పెరుగు కంటే తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి చలువ చేస్తుంది. ఉప్పు, జీలకర్ర, అల్లం, కరివేపాకుతో కలిపిన మజ్జిగ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెరుగు తినాలంటే మధ్యాహ్నం మాత్రమే తినాలి. ఉదయం గానీ, రాత్రి వేళల్లో పెరుగు తింటే..  పెరుగులో కొంచెం నీరు కలిపి తినడం మంచిది. అలాగే.. పండ్లతో పాటు పెరుగు తినకూడదు. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Curd: పెరుగు ఇలా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం..!
Recommended image2
Curd: రోజూ పెరుగు తింటే.. ఇన్ని లాభాలు ఉన్నాయా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved