Curd: పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా..ఇక అంతే సంగతులు!
పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని ఆహారాలతో కలిపి తినడం వల్ల దుష్పరిణామాలు వస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

పెరుగు-జీర్ణక్రియ
మన రోజువారీ భోజనంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. మధ్యాహ్నం అన్నం చివర్లో ఒక చెంచా పెరుగు, రాత్రి భోజనం పెరుగన్నంతోనే ముగుస్తుంది. చిన్నప్పటి నుంచే పెరుగు మంచిదని పెద్దవారు చెబుతుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, శరీరానికి శక్తినిస్తుంది అంటారు. కానీ ఈ పెరుగు కూడా కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యానికి హానికరం అవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా!
శీతల గుణం
అయితే సమస్య పెరుగులో కాదు. దాంతో కలిపి తినే కొన్ని ఇతర ఆహార పదార్థాల్లోనే సమస్య ఉంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగు కొన్ని పదార్థాల తో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పెరుగు శీతల గుణంతో ఉంటుంది. ఇది శరీరంలోని వేడి తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అదే సమయంలో, కొన్ని పదార్థాలు వేడి గుణం కలిగి ఉండటం వల్ల రెండు గుణాలు మిళితమైనప్పుడు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పెరుగు-పాలు
ఇటీవలి కాలంలో చాలా మందికి ఒకే గ్లాస్‌లో పాలు తాగడం, ఆ తర్వాత వెంటనే పెరుగు తినడం అలవాటుగా మారింది. ఇదొక పెద్ద తప్పిదం. పాలలో లాక్టోజ్, పెరుగులో ఉన్న మైక్రోఆర్గానిజంల మేళవింపు వల్ల జీర్ణ వ్యవస్థ తలకిందులవుతుంది. అలెర్జీలు, మలబద్ధకం, శ్వాస సంబంధిత సమస్యలు మొదలవుతాయి.
పెరుగు -ఉల్లిపాయ
ఇంకొంతమంది పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కలిపి తినటం, పెరుగు అన్నం పక్కన ఉల్లిపాయ కొరికేయడం చూస్తుంటాం. ఉల్లిపాయ వేడి గుణం కలిగి ఉంటుంది. పెరుగు చల్లదనం కలిగి ఉంటుంది. ఈ రెండు బలంగా విరుద్ధ స్వభావాల వంటివి. ఇవి కలిపి తింటే అజీర్ణం, గ్యాస్, మంట లాంటి సమస్యలు తలెత్తే అవకాశముంది.
పెరుగు-చేపలు
పెరుగుతో చేపలు తినడమూ ఒక ప్రమాదకరమైన కలయికగా పరిగణిస్తారు. ఈ రెండింటిలోనూ ప్రోటీన్ ఉన్నప్పటికీ, అవి శరీరంలో జీర్ణం అయ్యే విధానం వేరే కావడంతో ఇది శరీరానికి తక్కువ కాలానికే మానసిక అలసట, చర్మ రుగ్మతలు, అలెర్జీలు కలిగించగలదు.
పెరుగు-నిమ్మరసం
ఇంకొన్ని సందర్భాల్లో, పెరుగులో నిమ్మరసం కలుపుతారు లేదా పుల్లని పదార్థాలు కలిపి తింటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఆమ్లస్థాయులు ఏకంగా పెరిగిపోతాయి. ఫలితంగా కడుపులో మంట, అజీర్ణం, గుండెల్లో మంట లాంటి సమస్యలు తలెత్తుతాయి.
పెరుగు-మినపప్పు
పెరుగుతో మినపపప్పు వంటివి కలిపి తినడం కూడా మంచిది కాదు. మినుముల్లో ఉన్న ప్రోటీన్ జీర్ణమవడానికే సమయం తీసుకుంటుంది. పెరుగు కూడా వ్యత్యాసంగా పనిచేసే పదార్థం. ఈ రెండు కలిపితే శరీరం ఎడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. గ్యాస్, బరువు అనిపించడం, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి.
ఎప్పుడు తినాలి, ఎలా తినాలి
పెరుగు తినాలంటే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అన్నదే ముఖ్యం. ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం పెరుగు తినడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా మధ్యాహ్నం భోజన సమయంలో. వేసవి కాలంలో మధ్యాహ్నం పెరుగు తినడం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే రాత్రి సమయాల్లో మాత్రం పెరుగు తినడం మంచిది కాదు. రాత్రిపూట శరీర జీర్ణక్రియ నిదానంగా జరిగే సమయంలో పెరుగు తీసుకుంటే కఫ దోషం పెరిగే ప్రమాదం ఉంటుంది. జలుబు, దగ్గు, శ్లేష్మం వంటి సమస్యలు మొదలవుతాయి.
మంచిది కాదు
భోజనం చేసిన వెంటనే భారీగా పెరుగును తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చిన్న పరిమాణంలో, భోజనానికి చివర్లో రెండు ముద్దల చల్లని పెరుగు అన్నం తినడం మంచిదే కానీ దానికి పక్కన నిమ్మకాయ, ఉల్లిపాయ, పులుసులు వంటి పదార్థాలను దూరంగా పెట్టాలి.