Snoring: ఇలా చేస్తే.. రాత్రి పడుకుంటే గురక సమస్యే ఉండదు..!
మనం ఎలా పడితే అలా పడుకుంటే కూడా ఈ గురక సమస్య రావచ్చు. చాలా మంది బోర్లా లేదా.. వెళ్లికలా పడుకుంటారు. ఇలా పడుకుంటే గురక వస్తుంది.

గురక సమస్యకు పరిష్కారం..
చాలా మంది గురక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ గురక కారణంగా వాళ్లు మాత్రమే కాదు.. పక్కన వాళ్లు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం. ప్రశాంతంగా నిద్రపోలేక చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే, కొన్ని రకాల లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో తెలుసుకుందామా...
నిద్రపోయే పొజిషన్..
మనం ఎలా పడితే అలా పడుకుంటే కూడా ఈ గురక సమస్య రావచ్చు. చాలా మంది బోర్లా లేదా.. వెళ్లికలా పడుకుంటారు. ఇలా పడుకుంటే గురక వస్తుంది. అలా కాకుండా.. ఏదో ఒకవైపు తిరిగి పడుకుంటే గురక వచ్చే అవకాశం తగ్గుతుంది. కుడివైపు లేదంటే, ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.
బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి..
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా గురక వస్తూ ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో వారి వాయుమార్గాలలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఇది గాలిని సరిగా లోపలికి, వెలుపలికి వెళ్లకుండా చేసి గురక సమస్యను పెంచుతుంది.కాబట్టి, ముందుగా అధిక బరువు తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేస్తే.. గురక తగ్గే అవకాశం ఉంది.
మద్యం మానేయాలి..
చాలా మంది రాత్రిపూట మద్యం తాగడం, స్మోకింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా గురక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకోవడం మానేయాలి. నిజానికి పూర్తిగా మానేయాలి. కాకపోతే.. కనీసం నిద్రపోవడానికి ముందు అయినా మానేయాలి.
హైడ్రేషన్..
శరీరంలో తేమ తగ్గితే ముక్కు, గొంతు పొడిగా మారి గాలికి అడ్డుగా మారతాయి. రోజంతా తగినంత నీరు తాగడం, పడుకునే ముందు వెచ్చని టీ తీసుకోవడం వల్ల గురక సమస్యను తగ్గించుకోవచ్చు.
నిద్రకు ముందు భారీ భోజనం..
నిద్రకు ముందు హెవీగా ఫుడ్ తినడం గురకకు దారితీయవచ్చు. కనీసం 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేయడం మంచిది.
స్లీప్ సైకిల్..
మంచి స్లీప్ సైకిల్ ఫాలో అవ్వాలి. అంటే.. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్ర మేళ్కొనడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా.. రెగ్యులర్ గా యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల కూడా గురకను తగ్గించుకోవచ్చు.
పై సూచనలు పాటిస్తే, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అయినప్పటికీ గురక కొనసాగితే, వైద్యులను సంప్రదించడం మంచిది.