- Home
- Life
- Health
- రోజూ ఫుల్లుగా తాగే వాళ్లకు క్యాన్సర్ రావడం గ్యారెంటీ: మానుకోకపోతే ప్రాణాలకే ముప్పు.. వైద్యుల హెచ్చరిక!
రోజూ ఫుల్లుగా తాగే వాళ్లకు క్యాన్సర్ రావడం గ్యారెంటీ: మానుకోకపోతే ప్రాణాలకే ముప్పు.. వైద్యుల హెచ్చరిక!
పగలంతా పనిచేసి రాత్రికి రెండు పెగ్గులేసి హాయిగా పడుకుందాం అనుకుంటున్నారా? రెండు పెగ్గులతో సరిపెట్టుకోకుండా ఫుల్ గా తాగేస్తే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఆల్కహాల్ తాగడం క్యాన్సర్‌కు కారణమవుతుందని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 7.5 లక్షల మంది ఆల్కహాల్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది భవిష్యత్తులో మరింత ఎక్కువ సంఖ్యకు చేరుకుంటుందని తెలిపారు. మద్యం కొద్దిగా తాగినా ఆరోగ్యానికి ప్రమాదకరమేనని అంటున్నారు.
ఆల్కహాల్ వల్ల ఇవి పాడైపోతాయి..
సరదాగా ప్రారంభమయ్యే మద్యం అలవాటు తర్వాత వ్యసనంగా మారుతుంది. మొదట్లో యాక్టివ్ గా అనిపించినా, పోనుపోను మద్యం శరీర భాగాలను నాశనం చేస్తుంది.
మద్యం వల్ల ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయం, నోటి క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. మద్యం ప్రతి రోజూ, ఎక్కువమొత్తంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వారు పేర్కొన్నారు.
ఇండియాలో ఏటా 62 వేల మందికి క్యాన్సర్..
భారతదేశంలో ఆల్కహాల్ వాడకం వల్ల ఏటా సుమారు 62 వేల మందికి క్యాన్సర్ వస్తోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో చైనాలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. సుమారు 2.8 లక్షల మంది మద్యం కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో క్యాన్సర్ బాధితులు మరింతగా పెరిగిపోతారని విశ్లేషకుల అంచనా.
అలవాట్లు మానుకుంటేనే జీవితం..
మద్యం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. కాని అంతర్గతంగా శరీర భాగాలను బాగా డామేజ్ చేస్తుంది. అందుకే మద్యం అలవాటు మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ ముప్పు నివారించడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. మద్యం వాడకాన్ని పూర్తిగా నియంత్రించగలిగితే, క్యాన్సర్ కేసులను గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు చొరవ చూపాలి
ఈ నేపథ్యంలో, మద్యం వల్ల వచ్చే ప్రమాదాలపై ప్రజల అవగాహన పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. మద్యం నిషేధ పాలసీలను స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. యువత ఆల్కహాల్ కి బానిస కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఆల్కహాల్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.