MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Weight Loss Mistakes: ఈ 7 తప్పులు చేస్తే జీవితంలో బరువు తగ్గరు.. టైం, శ్రమ వేస్ట్ అంతే!

Weight Loss Mistakes: ఈ 7 తప్పులు చేస్తే జీవితంలో బరువు తగ్గరు.. టైం, శ్రమ వేస్ట్ అంతే!

ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం పెద్ద ఛాలెంజ్‌ అయిపోయింది. ఎన్నో డైట్ ప్లాన్లు ఫాలో అవుతున్నా, గంటల తరబడి వర్కౌట్లు చేస్తున్నా ఫలితం కనిపించక చాలామంది నిరాశ చెందుతుంటారు. కానీ మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పులే బరువు తగ్గకుండా చేస్తాయి. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 15 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బరువు తగ్గేటప్పుడు చేసే తప్పులు
Image Credit : our own

బరువు తగ్గేటప్పుడు చేసే తప్పులు

బరువు తగ్గడం అనేది డైట్ లేదా వ్యాయామం మీద మాత్రమే కాదు, అది మొత్తం జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడానికి కారణం చిన్న చిన్న తప్పులే. అవే దీర్ఘకాలంలో ఫ్యాట్ తగ్గకుండా అడ్డుకుంటాయి. బరువు తగ్గడాన్ని ఆపే 7 తప్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
రాత్రి లేటుగా తినడం
Image Credit : AI Generated

రాత్రి లేటుగా తినడం

రాత్రి భోజనం ఆలస్యంగా తినడం వల్ల శరీరానికి ఆహారం జీర్ణం చేసుకునే సమయం తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రి 9–10 గంటల తర్వాత తినే అలవాటు మెటాబాలిజాన్ని మందగింపజేస్తుంది. దీని వల్ల తీసుకున్న కేలరీలు కొవ్వుగా మారే అవకాశం ఎక్కువ. నిద్రకి దగ్గరగా భోజనం చేయడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

Related Articles

Related image1
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Related image2
Moringa Powder: మునగాకు పొడితో ఊహించని లాభాలు.. ఈ సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు!
38
 నీళ్లు తక్కువగా తాగడం
Image Credit : Getty

నీళ్లు తక్కువగా తాగడం

శరీరంలో ఫ్యాట్ బ్రేక్‌డౌన్ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. తక్కువ నీరు తాగితే మెటాబాలిజం స్లో అవుతుంది. అలాగే ఆకలి ఎక్కువగా అనిపించి అదనంగా తినే అవకాశం ఉంటుంది. రోజుకు సరిపడా నీరు తాగకపోతే బరువు తగ్గడం చాలా కష్టం అవుతుంది.

48
కేలరీలు ఎక్కువగా తీసుకోవడం
Image Credit : our own

కేలరీలు ఎక్కువగా తీసుకోవడం

చాలామంది కాఫీ, టీ, ప్యాకెట్ జ్యూసులు ద్వారా తెలియకుండానే ఎక్కువ కేలరీలు తీసుకుంటారు. షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ బరువు పెరగడానికి ముఖ్య కారణం. “లిక్విడ్ కేలరీలు” శరీరానికి తృప్తి ఇవ్వవు, కానీ ఫ్యాట్ ని పెంచుతాయి.

58
ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం
Image Credit : Getty

ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం

ప్రోటీన్ శరీరంలో మజిల్స్ నిర్మాణానికి, ఫ్యాట్ బర్నింగ్‌కు చాలా అవసరం. ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. బరువు తగ్గే డైట్‌లో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.

68
ఎక్సర్సైజ్ మీదే ఆధారపడటం
Image Credit : Getty

ఎక్సర్సైజ్ మీదే ఆధారపడటం

ఎక్సర్సైజ్ చేయడం మంచిదే కానీ కేవలం దాని మీదే ఆధారపడితే బరువు తగ్గడం కష్టం. డైట్ కంట్రోల్ లేకుండా ఎంత వర్కౌట్ చేసినా ఫలితం పరిమితమే. బరువు తగ్గడం అనేది 70% డైట్, 30% ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది.

78
బరువు తగ్గాలని తక్కువగా తినడం
Image Credit : PINTEREST

బరువు తగ్గాలని తక్కువగా తినడం

చాలామంది త్వరగా బరువు తగ్గాలని చాలా తక్కువగా తింటారు. ఇది శరీరాన్ని “సర్వైవల్ మోడ్” లోకి నెట్టేస్తుంది. ఫలితంగా మెటాబాలిజం తగ్గిపోతుంది. తర్వాత ఎక్కువగా తినే అలవాటు పెరుగుతుంది. దీని వల్ల బరువు ఇంకా పెరగవచ్చు.

88
నిద్ర లేకపోవడం
Image Credit : stockPhoto

నిద్ర లేకపోవడం

నిద్ర లేకపోతే హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఆకలి పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. సరైన నిద్ర లేకుండా బరువు తగ్గడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image2
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image3
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Related Stories
Recommended image1
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Recommended image2
Moringa Powder: మునగాకు పొడితో ఊహించని లాభాలు.. ఈ సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved