MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి!

Health Tips: షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి!

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ వ్యాధిని దూరం పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : Aug 05 2025, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గజిబిజి లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధి.. సైలెంట్ గా వ్యక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కళ్లు, కిడ్నీ, గుండె ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకన్నా.. ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

26
నిద్ర లేమి
Image Credit : Getty

నిద్ర లేమి

శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే.. రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

Related Articles

Related image1
Health tips: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్ కంట్రోల్ కావడం పక్కా!
Related image2
Health Tips for Diabetes: షుగర్ పేషెంట్లు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే సమస్యలు తప్పవు!
36
వ్యాయామం
Image Credit : Getty

వ్యాయామం

ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆక్టీవ్ గా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తగినంత వ్యాయామం లేకపోయినా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.  

46
ఒత్తిడి
Image Credit : Getty

ఒత్తిడి

ఒత్తిడి చాలా సమస్యలను తెస్తుంది. ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే వ్యక్తికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది ఇన్సులిన్‌ను నిరోధించి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం వాకింగ్, యోగా, ధ్యానం వంటివి చేయవచ్చు. 

56
పేగు ఆరోగ్యం
Image Credit : Getty

పేగు ఆరోగ్యం

ఇన్సులిన్ సెన్సిటివిటీలో గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుంది. సరైన మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు, పేగు బ్యాక్టీరియా దాన్ని విచ్ఛిన్నం చేసి బ్యూటిరేట్ వంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌లుగా మారుస్తుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

66
భోజన సమయం
Image Credit : Getty

భోజన సమయం

సమయానుసారం.. తగిన మోతాదులో ఆహారం తీసుకోవాలి. రెండు గంటలకోసారి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నివారించవచ్చు. కాబట్టి కచ్చితమైన సమయాల్లో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image2
Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Periods: హెవీ బ్లీడింగ్‌తో విసిగిపోయారా? ఈ చిట్కాలు మీ కోసమే
Related Stories
Recommended image1
Health tips: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్ కంట్రోల్ కావడం పక్కా!
Recommended image2
Health Tips for Diabetes: షుగర్ పేషెంట్లు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే సమస్యలు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved