MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Technology
  • Gadgets
  • LPG Cylinder Shortage : మీ కిచెన్ లో ఇవి ఉంటే చాలు.. గ్యాస్ సిలిండర్ లేకున్నా వండుకోవచ్చు

LPG Cylinder Shortage : మీ కిచెన్ లో ఇవి ఉంటే చాలు.. గ్యాస్ సిలిండర్ లేకున్నా వండుకోవచ్చు

గ్యాస్ స్టవ్ లపై బాగా ఆధారపడటం వల్ల ఎల్పిజి సిలిండర్ కొరత ఆందోళన కలిగిస్తోంది. కానీ మహిళలు కొంచెం తెలివిగా ఆలోచిస్తే గ్యాస్ అవసరం లేకుండానే వంటలు వండుకోవచ్చు. ఇందుకోసం పనికొచ్చే కొన్ని పద్ధతులు, వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 11 2026, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్యాస్ సిలిండర్ కు ప్రత్యామ్నాయాలివే..
Image Credit : ANI

గ్యాస్ సిలిండర్ కు ప్రత్యామ్నాయాలివే..

LPG Cylinder Shortage : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో... ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో యుద్దం జరిగితే భారతీయులకు ఇబ్బందులు తప్పడంలేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తో పాటు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను హోటళ్ళకు సరఫరా చేయడంలేదు... దీంతో హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడే పరిస్థితి నెలకొంది. ఇక గృహవినియోగ సిలిండర్ల బుకింగ్‌ పై కూడా ఆంక్షలు పెరుగుతున్నాయి... దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండక్షన్ స్టవ్
Image Credit : Amazon.in

ఇండక్షన్ స్టవ్

అయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో పనిలేకుండానే వంటలు చేసుకునే మార్గాలున్నాయి. పూర్వకాలంలో మాదిరిగా కట్టెల పొయ్యిని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుతూ కష్టపడే పద్దతులు కావు... గ్యాస్ సిలిండర్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఇందులో ముఖ్యమైనది ఇండక్షన్ స్టవ్. గతంలో వీటిని విరివిగా వాడేవారు... ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎప్టెక్ట్ తో మళ్లీ గిరాకీ పెరిగింది.

కరెంట్‌తో పనిచేసే ఇండక్షన్ స్టవ్ అయస్కాంత తరంగాల ద్వారా పాత్రను వేడి చేసి, వంటను వేగంగా పూర్తి చేస్తుంది. ఇందులో భద్రతా ఫీచర్లు కూడా ఎక్కువే. అందుకే చాలా ఇళ్లలో ఇప్పటికే దీనిని ప్రధాన వంట పరికరంగా ఉపయోగిస్తున్నారు. గ్యాస్ కొరత ఉన్నప్పుడు ఇది మంచి ప్రత్యామ్నాయం.

35
ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్
Image Credit : meta ai

ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్

ప్రస్తుతం ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ చాలా వంటగదుల్లో ముఖ్యమైన వస్తువుగా మారింది. దీనిలో అన్నం, పప్పు, కూరగాయలు వంటివి సులభంగా వండొచ్చు. ప్రెషర్ కుకింగ్, స్టీమింగ్ వంటి ఫీచర్లు ఒకే పరికరంలో ఉండటంతో వంట సమయం కూడా తగ్గుతుంది. దీనిని వాడటం వల్ల LPG వాడకాన్ని తగ్గించుకోవచ్చు.

45
సోలార్ కుక్కర్
Image Credit : Pinterest

సోలార్ కుక్కర్

సోలార్ కుక్కర్ మరో పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయం. సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని వండే ఈ పద్ధతికి ఇంధనం అవసరం లేదు. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది బెస్ట్ ఆప్షన్. 

ఇక ఎల్పిజి గ్యాస్ కు మరో మంచి ప్రత్యామ్నాయం బయోగ్యాస్. వంటగది లేదా వ్యవసాయ వ్యర్థాలతో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసి వంటకు వాడుకోవచ్చు. అయితే ఇందుకోసం ప్రత్యేక ప్లాంట్ ను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఈ బయోగ్యాస్ పర్యావరణహితమైన మార్గం.  

55
గ్రామాల్లో నో ప్రాబ్లమ్..
Image Credit : Gemini AI

గ్రామాల్లో నో ప్రాబ్లమ్..

ఇక పల్లెటూళ్లలోని చాలా ఇళ్లలో ఇప్పటికీ కట్టెల పొయ్యిలను వాడుతుంటారు. స్నానానికి నీరు కాచుకోడాలని, పండగల సమయంలో పిండివంటలు వండుకోడానికి ఈ పొయ్యిలనే వాడుతుంటారు. గ్రామాల్లో కట్టెలు కూడా ఉచితంగా లభిస్తాయి. కాబట్టి ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడినా, ధరలు పెరిగినా గ్రామీణప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులుండవు... కానీ పట్టణాలు, నగరాల్లో నివాసముండేవారు మాత్రం ఇండక్షన్ స్టవ్, సోలార్ కుక్కర్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
యుద్ధం
ప్రపంచం
యుటిలిటీ
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఆహారం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Related Stories
Recommended image1
Gas Cylinder: సిలిండర్ త్వరగా అయిపోతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గ్యాస్ ఆదా..
Recommended image2
Gas Burner: గ్యాస్ స్టవ్ మంట తగ్గిందా? బర్నర్‌ను 15 నిమిషాల్లో కొత్తదానిలా మార్చే కిచెన్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved