మటన్ లివర్ ,చికెన్ లివర్... రెండింటిలో ఏది మంచిది..? ఎవరు తినకూడదు..?
చికెన్ , మటన్ లివర్ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
లివర్ ఇష్టంగా తింటున్నారా?
మాంసాహార ప్రియులకు చికెన్, మటన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చికెన్ , మటన్ లివర్ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఆరోగ్యకపరంగా చూస్తే.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఏది ఎంత తినాలి? అసలు ఎవరు ఈ లివర్ కి దూరంగా ఉండాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
చికెన్ లివర్ లో పోషకాలు..
చికెన్ లివర్ లో ఐరన్, విటమిన్ ఎ, బి12, ఫోలేట్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఐరన్ (Iron): ఇది రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.
విటమిన్ A: కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బి12, ఫోలేట్: నాడీ వ్యవస్థకు అవసరమైనవే కాక, గర్భిణీ స్త్రీలకు కూడా ముఖ్యం.
ప్రోటీన్: శరీర కండరాల బలానికి అవసరం.
యాంటీఆక్సిడెంట్లు: ఇమ్యూనిటీ పెరిగి శరీరం ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందుతుంది.
మటన్ లివర్ లో పోషకాలు..
మటన్ లివర్ లో విటమిన్ బి12, ఖనిజాలు, ఐరన్, ప్రోటీన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ B12: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది.
ఖనిజాలు: ఎముకలు, దంతాలకు ఉపయోగపడే జింక్, సెలీనియం లాంటి మినరల్స్ ఉన్నాయి.
ఇనుము: రక్తహీనత నివారణలో ఇది కూడా ఉపయుక్తం.
ప్రోటీన్: వ్యాయామం వల్ల దెబ్బతినే కండరాల మరమ్మత్తుకు ఇది అవసరం.
విటమిన్ A, ఫోలేట్: చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చికెన్ లివర్, మటన్ లివర్ రెండింటిలో ఏది బెస్ట్...?
పోషకాల పరంగా చూస్తే, మటన్ లివర్ చికెన్ లివర్ కంటే కొంచెం మెరుగైనదిగా నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు లివర్‌లను కూడా మితంగా తీసుకోవాలి. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి.
లివర్ కి ఎవరు దూరంగా ఉండాలి..?
అందరికీ లివర్ సరిగా సూటవ్వదు. మీరు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అంతేకాదు.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు లివర్ కి దూరంగా ఉండాలి.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ లివర్ కి దూరంగా ఉండాలి. మజిల్ డిజార్డర్స్ ఉన్నవారు కూడా దూరంగా ఉండటమే మంచిది.గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా వైద్యుల సలహా తీసుకోకుండా వీటిని తినకూడదు.
ఈ లివర్ ఎలా తినాలి..?
వారానికి 1-2 సార్లకే పరిమితం చేయాలి.మితంగా మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజూ తీసుకోవడం మంచిది కాదు. నాణ్యమైన మాంసం తీసుకోవాలి. అది కూడా శుభ్రంగా వండాలి.