కోడిగుడ్డును వీళ్లు అస్సలు తినొద్దు
నిజానికి గుడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. ఇది నిజమే. కానీ కొంతమంది మాత్రం గుడ్డును తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లు ఎవరంటే?

గుడ్డు
చాలా మంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిజానికి గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తినాలని చెప్తుంటారు.
గుడ్డు
గుడ్లలో తక్కువ కేలరీలు, మోనోశాచురేటెడ్ కొవ్వు, కోలిన్, లుటిన్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే తక్కువ సోడియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, భాస్వరం, అమైనో ఆమ్లాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల మనకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ గుడ్డు ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును దీన్ని తినడం వల్ల కొంతమంది అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.
గుడ్లను ఎవరు తినకూడదు
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు
గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎవరి శరీరంలో అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వారు గుడ్డును ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వీరు పచ్చసొనను అస్సలు తినకూడదు.
గుండెజబ్బులు రావొచ్చు
పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు ఒక గుడ్డును తింటే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కానీ ఒక గుడ్డుకంటే ఎక్కువ గుడ్లను ప్రతిరోజూ తింటే మాత్రం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే గుండె జబ్బులతో బాధపడేవారు గుడ్లను అతిగా తినకూడదు.
జీర్ణ సమస్యలు
గుడ్లను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు. కాబట్టి మీకు ఇదివరకే జీర్ణ సమస్యలు ఉంటే గనుక గుడ్డును తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే గుడ్డు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో మీరు గుడ్డును తింటే మీ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కకడుపు ఉబ్బరం ఎక్కువ అవుతుంది. అందుకే తినకూడదు.
బరువు పెరగొచ్చు
బరువు ఎక్కువగా ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. కేలరీలు ఎక్కువగా ఉన్న గుడ్డును రోజూ బ్రేక్ ఫాస్ట్ లొ తినడం అలవాటు చేసుకుంటే మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఒక్క గుడ్డునే కాకుండా తాజా కూరగాయలను తింటే మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.
గుడ్డు
అలర్జీలు
కొంతమందికి గుడ్డు అలెర్జీ కూడా ఉంటుంది. ఉంటుంది. ఈ విషయం తెలియక గుడ్డును అలాగే తింటుంటారు. ఇలాంటి వారికి గుడ్డును తిన్న వెంటనే వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీకు గుడ్డుకు అలెర్జీ ఉంటే గనుక గుడ్డును తినకపోవడమే మంచిది.
చర్మ సమస్యలు
కొన్ని చర్మ సమస్యలు ఉన్నవారు కూడా గుడ్లను తినకూడదు. అంటే తామర, మొటిమలు వంటి చర్మ సమస్యలు ఉంటే గుడ్డును తినకండి. ఎందుకంటే గుడ్డు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే మీ చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అయితే ఈ సమస్య గుడ్డు తిన్న ప్రతి ఒక్కరికీ వస్తుందని కాదు.
మూత్రపిండాల సమస్యలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు గుడ్డును అస్సలు తినకూడదు. లేదా డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే గుడ్డును తినాలి. ఎందుకంటే గుడ్డులో భాస్వరం, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మీ మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచి మీ సమస్యను పెంచుతుంది.