Chicken: చికెన్ లో ఈ పార్ట్స్ తింటే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
చికెన్ ని చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు వారానికి ఒకసారి తింటే.. మరికొందరు రెండు, మూడు రోజులకు ఒకసారి తింటారు. రోజూ తినేవాళ్లు కూడా లేకపోలేదు. చికెన్ తో చేసే వెరైటీలు చూస్తే మనసు ఊరుకోదు కాబట్టి.. చికెన్ ని పక్కన పెట్టడం కష్టమే. వాస్తవానికి చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కొన్ని పార్ట్ అస్సలు తినకూడదట. వాటివల్ల ఆరోగ్యానికి మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం ఉందట. మరి చికెన్లో ఏ భాగాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

చికెన్ రుచిగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ధర కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలామంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ని ఒక పట్టు పడతారు. కొందరు వారంతో సంబంధం లేకుండా కూడా తింటారు. వర్కౌట్ చేసేవారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివారు రెగ్యులర్ గా చికెన్ తింటుంటారు. అయితే చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్నిభాగాలు తినడం అస్సలు మంచిదికాదట. అవెంటో ఇక్కడ చూద్దాం.
చర్మం తినకూడదు!
నిపుణుల ప్రకారం చికెన్ స్కిన్ తినడం మంచిది కాదు. అందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఉండటానికి వాటికి కెమికల్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. కాబట్టి కోడి చర్మానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
లెగ్ పార్ట్
బాయిలర్ కోడి తొడ భాగానికి ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. కోళ్లు త్వరగా బరువు పెరగాలని ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తుంటారట. అయితే చాలామంది ఇష్టంగా తినేవి లెగ్ పీస్ లే కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.
నాటుకోడి
ఒకవేళ మీరు నాటుకోడి తినాలి అనుకుంటే ధైర్యంగా ఈ పార్ట్స్ అన్నీ ధైర్యంగా తినచ్చు. ఎందుకంటే వాటికి ఎలాంటి కెమికల్స్ లేదా ఇంజెక్షన్స్ ఉపయోగించరు. ఇవి చాలా సహజంగా పెరుగుతాయి. తినడానికి రుచిగా ఉంటాయి.
వారానికి ఒక్కసారి..
ఒమేగా 3, ఒమేగా 6 లోపం ఉన్నవాళ్లు వారానికి ఒకసారి చికెన్ స్కిన్ తినొచ్చు. రోజు కోడి తినేవాళ్లు మాత్రం చికెన్ బ్రెస్ట్ పార్ట్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.