గుండ్రటి సొరకాయ, పొడవాటి సొరకాయ.. రెండింటిలో ఏది బెస్ట్..?
చాలా మంది రెండు సొరకాయలు ఆకారాల్లో మాత్రమే తేడా ఉంటుందని.. అంతకు మించి పెద్ద తేడా ఏమీ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. వీటి రుచిలోనూ చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఏ సొరకాయ తింటున్నారా?
సీజన్ తో సంబంధం లేకుండా మనకు లభించే కూరగాయల్లో సొరకాయ ముందు వరసలో ఉంటుంది. అయితే.. మార్కెట్ కి వెళ్లిన ప్రతిసారీ మనకు ఈ సొరకాయ రెండు రకాల్లో లభిస్తూ ఉంటుంది. కొన్ని సొరకాయలు పొడవుగా ఉంటే.. మరి కొన్ని గుండ్రంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది..? ఈ రెండింటిలో తేడా ఏంటి? ఏది తినడం మంచిది..? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
చాలా మంది రెండు సొరకాయలు ఆకారాల్లో మాత్రమే తేడా ఉంటుందని.. అంతకు మించి పెద్ద తేడా ఏమీ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. వీటి రుచిలోనూ చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పొడవాటి సొరకాయ, గుండ్రటి సొరకాయ మధ్య తేడాలు...
నిజానికి...ఈ రెండు రకాల సొరకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండ్రని సొరకాయను దేశీ రకం అని పిలుస్తారు. ఇది రుచి చాలా బాగుంటుంది. ఇది ఉడకడం కూడా చాలా సులభం. ఎక్కువ సమయం తీసుకోదు. సాంబార్ లో వేస్తే.. రుచి డబల్ అవుతుంది. మరోవైపు పొడవైన సొరకాయ హైబ్రిడ్ కావచ్చు. కాబట్టి... మీకు మార్కెట్లో ఈ రెండూ కనిపిస్తే... గుండ్రని కాయను ఎంచుకోవడం మంచిది.
ఎలాంటి సొరకాయను ఎంచుకోవాలి..?
సొరకాయ కొనేటప్పుడు.. అది నునుపుగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఈ కాయపై మీకు చిన్న వెంట్రుకలు లాంటివి కనిపిస్తున్నాయి అంటే.. అది చాలా మంచిదని, రుచికరమైనదని అర్థం చేసుకోవాలి. మరీ పెద్దదిగా ఉండకూడదు, చిన్నగా కూడా ఉండకూడదు.. మీడియం సైజులో ఉన్నది ఎంచుకోవడం మంచిది.
సొరకాయలో పోషకాలు...
సొరకాయలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ ఇ ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉటాయి. అంతేకాదు.. జింక్, ఫోలిక్ యాసిడ్, రాగి, సెలీనియం, కాల్షియం, భాస్వరం కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో నీటి శాతంతో పాటు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా బాగా సహాయపడుతుంది.
సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...
సొరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రధానంగా ఈ కూరగాయలో తక్కువ కేలరీల శాతం తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు తొందరగా నిండుతుంది. సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరచడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది
గుండెను కాపాడుకోవడానికి సొరకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి మూడు సార్లు ఈ సొరకాయ రసం తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది.
నిద్రలేమి సమస్యకు చెక్...
సొరకాయ రెగ్యులర్ గా తినడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. దీని కోసం, మీరు సొరకాయ రసంలో కొంత నువ్వుల నూనె కలపవచ్చు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల మీరు బాగా నిద్రపోగలరు.
బరువు తగ్గించే సొరకాయ..
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి మంచిది: బరువు తగ్గాలని ఆలోచిస్తున్న వారు ఈ కూరగాయల రసం తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ కూరగాయలో ఐరన్, విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ సొరకాయ రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి
ఈ రోజుల్లో, పెరుగుతున్న కాలుష్యం కారణంగా, చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారు మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు సొరకాయ రసం తాగవచ్చు. ఇది మీ జుట్టును అందంగా, నల్లగా కనిపించడానికి సహాయం చేస్తుంది.