MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది

Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది

Ice Cream: వేసవిలో కూల్‍గా ఏదైనా తినాలి అంటే ముందు ఐస్ క్రీంనే చూస్తారు. ఎవరైనా సరే లాగించేస్తారు. ఐస్ క్రీం అంటే కచ్చితంగా పాలే వాడతారు. కానీ డైట్ చేసేవాళ్లు, పాలు ఇష్టపడని వాళ్లు దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసమే పాలులేని ఐస్ క్రీం. తింటే ఐసైపోతారు.

2 Min read
Author : Nandini Arava
Published : May 19 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బనానా ఐస్ క్రీం
Image Credit : chat GPT

బనానా ఐస్ క్రీం

పాలు, క్రీమ్‌తో పనిలేకుండా కేవలం అరటిపండుతోనే ఎంతో క్రీమీగా, టేస్టీగా ఉండే హెల్దీ ఐస్‌క్రీమ్‌ను ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 3-4 బాగా పండిన అరటిపండ్లను చిన్న ముక్కలుగా కోసి, ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి కనీసం 5 గంటల పాటు ఫ్రీజర్‌లో గడ్డకట్టనివ్వాలి. వాటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆపై అందులోనే రుచికి సరిపడా తేనె, వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమమంతా పర్‌ఫెక్ట్ ఐస్‌క్రీమ్ స్ట్రక్చర్‌లోకి వచ్చేవరకు బాగా బ్లెండ్ చేయాలి. చివరగా ఈ స్మూత్ మిశ్రమాన్ని ఒక బాక్స్‌లోకి తీసుకుని, మరో 2 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచి సెట్ చేస్తే ఎంతో రుచికరమైన నాచురల్ బనానా ఐస్‌క్రీమ్ రెడీ. అరటిపండులో ఉండే సహజమైన జిగురు వల్ల పాలు లేకపోయినా ఇది నోట్లో వేస్తే కరిగిపోయేలా సాఫ్ట్‌గా ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మ్యాంగో-కోకోనట్ ఐస్‌క్రీమ్
Image Credit : chat GPT

మ్యాంగో-కోకోనట్ ఐస్‌క్రీమ్

వేసవి కాలంలో పిల్లలకు ఎంతో ఇష్టమైన మామిడి-కొబ్బరి ఐస్‌క్రీమ్‌ను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు పండిన మామిడిపండు గుజ్జు, ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు, మూడు చెంచాల చక్కెర, సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమం అంతా బాగా మెత్తగా అయ్యాక  ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకుని 5 నుండి 6 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. అయితే, ఐస్‌క్రీమ్ మధ్యమధ్యలో గడ్డలుగా మారకుండా సాఫ్ట్‌గా రావాలంటే, ఫ్రీజ్ అవుతున్న సమయంలో ఒకటి లేదా రెండు సార్లు బయటకు తీసి బాగా కలిపి మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే పర్‌ఫెక్ట్ మ్యాంగో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ మీ నోట్లోకి జారిపోద్ది

Related Articles

Related image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Related image2
Kitchen Hacks: ఈ ఒక్కటి కలిపితే ఎన్ని రోజులైనా సరే పాలు విరగవు
35
స్ట్రాబెర్రీ బనానా ఐస్‌క్రీమ్
Image Credit : chat GPT

స్ట్రాబెర్రీ బనానా ఐస్‌క్రీమ్

స్ట్రాబెర్రీ, అరటిపండు కాంబినేషన్‌తో పాలు లేకుండానే పిల్లలకు ఎంతో నచ్చే హెల్దీ ఐస్‌క్రీమ్‌ను సులభంగా తయారు చేయవచ్చు. దీనికోసం ముందుగా స్ట్రాబెర్రీ, అరటిపండు ముక్కలను ఒక డబ్బాలో ఉంచి, అవి బాగా గట్టిపడే వరకు ఫ్రీజర్‌లో పెట్టాలి. ముక్కలు పూర్తిగా గడ్డకట్టిన తర్వాత వాటిని బ్లెండర్‌లో వేసి, ఎక్కడా పలుకులు లేకుండా మెత్తటి క్రీమీ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే తీపికి సరిపడా చక్కెర లేదా తేనె వేసి మరోసారి బాగా బ్లెండ్ చేయాలి. ఈ స్మూత్ మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లోకి తీసుకుని, 3 నుండి 4 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచితే ఐస్‌క్రీమ్ రెడీ. స్ట్రాబరీ ఉండటం వల్ల నేచురల్‍గానే ఐస్ క్రీంకు పింక్ కలర్ వస్తుంది. దానివల్ల పిల్లలు ఎట్రాక్ట్ అవుతారు. 

45
ఓరియో బిస్కెట్ ఐస్‌క్రీమ్
Image Credit : chat GPT

ఓరియో బిస్కెట్ ఐస్‌క్రీమ్

ట్రెండింగ్ ఐస్ క్రీం...ఓరియో బిస్కెట్ ఐస్‌క్రీమ్‌. పాలు లేకుండానే ఎంతో రిచ్‌గా తయారు చేసుకోవచ్చు. పాలకు ప్రత్యామ్నాయంగా చిక్కటి కొబ్బరి పాలు లేదా కొబ్బరి క్రీమ్‌ను ఉపయోగించి ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. దీనికోసం ముందుగా కొన్ని ఓరియో బిస్కెట్లను తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి క్రీమ్‌ను తీసుకుని బ్లెండర్‌లో వేసి బాగా బ్లెండ్ చేసి, అందులోనే ఈ ఓరియో బిస్కెట్ పొడిని కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేయాలి. ఈ క్రీమీ మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి మార్చుకుని, పైన మరికొంత ఓరియో పొడిని చల్లి 5 నుండి 6 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. పాలు, క్రీమ్ వాడకపోయినా కొబ్బరి క్రీమ్ వల్ల ఇది అచ్చం బయట కొన్న ఐస్‌క్రీమ్‌లాగే ఎంతో రిచ్‌గా, క్రీమీ టెక్స్చర్‌తో నోరూరిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. 

55
వాటర్‌మెలన్ ఐస్‌క్రీమ్
Image Credit : chat GPT

వాటర్‌మెలన్ ఐస్‌క్రీమ్

పుచ్చకాయతో కూడా చాలా టేస్టీ ఐస్‌క్రీమ్ చేసేయొచ్చు తెలుసా. దీని కోసం 2 కప్పుల పుచ్చకాయ ముక్కలు, 1 చెంచా నిమ్మరసం, 2 చెంచాల తేనెను కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన మౌల్డ్‌లలో వేసి 4-5 గంటలు ఫ్రీజర్‌లో సెట్ అవ్వనివ్వాలి. ఈ ఐస్‌క్రీమ్ చాలా రిఫ్రెషింగ్‌గా, తక్కువ కేలరీలతో ఉంటుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Related Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Kitchen Hacks: ఈ ఒక్కటి కలిపితే ఎన్ని రోజులైనా సరే పాలు విరగవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved