Salt: ఉప్పులో కూడా కెమికల్స్ ఉంటాయి.. ఇలా శుద్ధి చేసి వాడండి
ఉప్పులేని కూరలు అస్సలు ఉండవు. ఉప్పును కూరల్లోనే కాకుండా ఎన్నో రకాల ఆహారాల్లో వాడుతాం. కానీ ఉప్పు లో కూడా కెమికల్స్ ఉంటాయన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఉప్పును శుద్ధి చేయకుండా వాడితే మనకు ఎన్నో సమస్యలు వస్తాయి.

ఉప్పు
ఉప్పులేని ఆహారాలు అసలే ఉండవు. రోజూ ఉప్పును కూరలు, ఇతర ఆహారాల ద్వారా తీసుకుంటూనే ఉంటాం. ఉప్పును లిమిట్ లో తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. మోతాదుకు మించి తీసుకుంటేనే రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు వస్తాయి. నిజానికి మితమైన ఉప్పు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన ఉప్పునే వాడాలి.మీకు తెలుసా? మన తాతలు, ముత్తాతలు శుద్ధి చేసిన ఉప్పునే వాడేవారు. కానీ మనం కొన్న ఉప్పును శుద్ధి చేయకుండా అలాగే వాడేస్తుంటాం.
ఉప్పులో కెమికల్స్
రాళ్ల ఉప్పును ఈ రోజుల్లో వాడేవారు చాలా తక్కువ. చాలా మంది పొడి చేసిన ఉప్పునే వాడుతుంటారు. కానీ ఇది కల్లుప్పు పొడి కాదు. దీన్ని శుద్ధి చేస్తారు. కాబట్టి దీనికి ఎన్నో కెమికల్స్ ను కలుపుతారు. ఇలాంటి ఉప్పును అలాగే తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే అప్పట్లో కల్లుప్పును వాడేవారు. దాన్ని కూాడా వేయించి శుద్ధి చేసి వాడేవారు.
ఉప్పును శుద్ధి చేసే విధానం
అప్పట్లో వాడే కల్లుప్పును కూడా శుద్ధి చేసేవారు. ఈ కల్లుప్పును అలాగే లేదా దంచి పొడి చేసి వాడేవారు. కానీ దీన్ని వాడక ముందు ఖచ్చితంగా శుభ్రం చేసేవారు. ఎందుకంటే ఉప్పు తయారుచేసే చోటు ఎలా ఉంటుందో తెలియదు. దీనికి ఏమేమి అంటుకుంటుందో కూడా తెలియదు. అందుకే ఉప్పును కూడా శుద్ధి చేసి వాడేవారు.
ఉప్పులో కెమికల్స్ ఉంటాయా?
ఉప్పును తెల్లగా చేయడానికి కెమికల్ బ్లీచింగ్ చేసి ప్యాకెట్లలో నింపుతారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే ఉప్పును వాడకముందు వీటిని తొలగించడానికి కొన్ని పద్దతులను ఫాలో కావాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉప్పును ఎలా శుద్ధి చేయాలంటే?
ఉప్పులో ఉండే కెమికల్స్ పోవడానికి మీరు మునగాకు లేదా శంఖుపూల ఆకులను వాడొచ్చు. ఇందుకోసం ఇనుమ బాణలీలో ఒక కిలో ఉప్పులో 25 గ్రాముల ఆకులను వేసి తక్కువ మంటమీద వేయించండి. ఉప్పులోని తేమ పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేస్తే సరిపోతుంది.
ఉప్పును వేయిస్తే?
కావాలనుకుంటే మీరు మిరియాలతో కూడా ఉప్పును కూడా వేయించొచ్చు. ఇందుకోసం మిరియాలను ఉప్పులో వేసి తక్కువ మంటమీద వేసి వేయించండి. దీనివల్ల ఉప్పులోని తేమ పోతుంది. కెమికల్స్ కూడా తొలగిపోతాయి.