Tea Story: రోజూ ఇష్టంగా తాగే టీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
చాలామందికి టీ ఒక ఎమోషన్. ఉదయం లేవగానే టీ తాగకపోతే చాలామందికి ఏం తోచదు. ఫస్ట్ కడుపులో కప్పు టీ పడ్డాకే.. ఇతర పనులు స్టార్ట్ చేసేవాళ్లు ఎంతమందో. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు 4, 5 సార్లు టీ తాగేవాళ్లు కూడా లేకపోలేదు. చలికాలం, వర్షాకాలంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇంత ఇష్టంగా తాగే ఈ టీ మొదటిసారి ఎలా తయారైందో మీకు తెలుసా? దీన్ని ఎక్కడ, ఎలా తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో టీ లవర్స్ కి కొదవ లేదు. వాటర్ తర్వాత ఏదైనా ఎక్కువగా తాగుతారు అంటే అది టీనే. మన దేశంలో చాలామంది కప్పు టీ తోనే వారి డే స్టార్ట్ చేస్తారు. అయితే మనం ప్రతిరోజు ఇష్టంగా తాగే టీ ఎప్పుడు తయారయిందో మీకు తెలుసా?

టీ మొదటిసారి ఎక్కడ తయారైంది?
టీ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టీని మొదటిసారి అనుకోకుండా తయారు చేశారు. టీకి పుట్టినిల్లు చైనా అని చెబుతారు. అక్కడే టీ ఆకులు పెరిగేవట. ఒకరోజు అనుకోకుండా కొన్ని ఆకులు ఎగిరిపోయి రాజభవనంలోని వంటగదిలో మరిగే నీటిలో పడ్డాయట. చక్రవర్తి షెన్ నంగ్ దాని రుచి చూసినప్పుడు చాలా సంతోషించాడట.

టీకి చా అని పేరు!
టీ రుచి, ఉల్లాసకరమైన ప్రభావం వల్ల చక్రవర్తి షెన్ నంగ్ దాన్ని క్రమం తప్పకుండా తాగేవారట. చక్రవర్తి షెన్ నంగ్ ఈ కషాయానికి "చా" అని పేరు పెట్టాడట. 1610లో పోర్చుగీసు, డచ్ వారు మొదటిసారి యూరోప్ దేశాలకు టీని దిగుమతి చేసుకున్నారట.

భారతదేశానికి టీ ఎలా వచ్చింది?
వ్యాపారం పెరిగే కొద్దీ టీ ఆకులను భద్రపరిచే పద్ధతిని కూడా కనుగొన్నారు. భారతదేశానికి టీని పరిచయం చేసింది పోర్చుగీసు వారని చెబుతారు.