Tea, Coffee: టీ, కాఫీ తయారుచేశాక ఎన్ని గంటల్లోపు తాగాలో తెలుసా?
ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగకపోతే చాలామందికి రోజు స్టార్ట్ కాదు. ఎంత పనున్నా ముందుగా టీ, కాఫీ పెట్టుకొని తాగాకే వేరే పని స్టార్ట్ చేస్తుంటారు. చాలామంది ఉదయం పెట్టిన టీ, కాఫీనే వేడి చేసి లేదా ప్లాస్క్ ఉపయోగించి సాయంత్రం వరకు తాగుతుంటారు. అయితే టీ, కాఫీ ఒకసారి చేశాక.. ఎంత టైం వరకు తాగాలి? ఎక్కువ టైం తర్వాత తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

పొద్దున్నే టీ, కాఫీ తాగడం చాలామందికి అలవాటు. రోజుకు నాలుగైదు సార్లు కూడా టీ తాగుతుంటారు చాలామంది. అయితే ఒకసారి టీ, కాఫీ చేశాక ఎంతసేపు తాజాగా ఉంటాయి? ఎంత సమయం తర్వాత అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
నిర్దిష్ట సమయం
నిపుణుల ప్రకారం టీ, కాఫీ తయారు చేసిన తర్వాత ఒక నిర్దిష్ట సమయం వరకే తాగాలి. ఆ సమయం తర్వాత టీ తాగితే దానివల్ల ఆరోగ్యానికి మంచి జరగకపోగా.. చెడు జరిగే ప్రమాదం ఉంటుంది.
ఎంత టైం వరకు తాగొచ్చు?
సాధారణంగా చాలామంది ఉదయాన్నే టీ, కాఫీ తయారుచేసి.. తర్వాత తాగాలి అనుకుంటే మళ్లీ వేడి చేసుకొని తాగుతుంటారు. టీ, కాఫీ లేదా గ్రీన్ టీలలో పాలు కలిపితే త్వరగా పాడవుతుంది. సాధారణంగా గ్రీన్ టీ ని 6 నుంచి 8 గంటల వరకు తాగవచ్చు.
పాల టీ
ఎక్కువశాతం మంది పాల టీని తాగుతుంటారు. పాలతో తయారు చేసిన టీ 2 నుంచి 4 గంటల తర్వాత పాడైపోతుంది. కాబట్టి, పాల టీ ని తయారు చేసిన వెంటనే తాగడం మంచిది.
బ్లాక్ టీ
సాధారణంగా బ్లాక్ టీ 8 నుంచి 12 గంటల వరకు తాజాగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎప్పుడైనా హ్యాపీగా తాగేయవచ్చు. కానీ ఏదైనా మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణుల సూచన.
కాఫీ
పాల కాఫీ 4 నుంచి 6 గంటల తర్వాత పాడవుతుంది. కాబట్టి, కాఫీని కూడా ఎక్కువ సేపు ఉంచి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ టైం దాటిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మేలు జరిగే బదులు హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.