Kitchen Hacks: ఈ ఒక్కటి కలిపితే ఎన్ని రోజులైనా సరే పాలు విరగవు
life May 15 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
పాలు విరగకుండా ఉండాలంటే
పొద్దున్నే గొంతులో టీనో, కాఫీనో పడాలి. దాని కోసం ఫ్రిడ్జ్ లో పాలు తీసి పొయ్యిపై పెట్టగానే విరిగిపోతాయి. ఈ సమ్మర్‍లో పాలను కాపాడటం కష్టమే. పాలు విరగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి.
Image credits: Getty
Telugu
అద్భుత చిట్కా
పాలు పాడవుతున్నాయని తెలిసినా, లేదా బయట ఎండ ఎక్కువగా ఉన్నా.. పాలను మరిగించే ముందు అందులో చిటికెడు వంట సోడా (Baking Soda) వేయండి.
Image credits: Getty
Telugu
బేకింగ్ సోడా ఎలా పనిచేస్తుంది?
వేడి వల్ల పాలలో 'లాక్టిక్ యాసిడ్' పెరిగి పాలు విరిగిపోతాయి. వంట సోడా పాలలో pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో పాలు విరగకుండా ఉంటాయి.
Image credits: Getty
Telugu
పాలను కాపాడే మరికొన్ని ముఖ్యమైన టిప్స్
సరైన టైంలో మరిగించండి పాలు ప్యాకెట్ ఇంటికి తీసుకురాగానే వెంటనే మరిగించాలి. ఎందుకంటే పచ్చిపాలు ఎండాకాలంలో త్వరగా పాడైపోతాయి.
Image credits: Getty
Telugu
చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టండి
వేడి పాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టొద్దు. దీనివల్ల ఫ్రిజ్ ఉష్ణోగ్రత పెరిగి, పాలతో పాటు ఇతర పదార్థాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.
Image credits: Getty
Telugu
శుభ్రమైన గిన్నె వాడండి
పాలు మరిగించే గిన్నెను పూర్తిగా శుభ్రం చేయాలి. గిన్నెలో ఇంతకుముందు మరిగించిన పాల మీగడ లేదా ఏమాత్రం పులుపు ఉన్నా పాలు విరిగిపోతాయి.
Image credits: Getty
Telugu
నీళ్లు వాడటం మర్చిపోవద్దు
గిన్నెలో పాలు పోయడానికి ముందు, అడుగున కొద్దిగా నీళ్లు పోయండి. దీనివల్ల పాలు అడుగంటవు, మాడిన వాసన కూడా రాదు.