MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే

Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే

Folk Song: తెలంగాణ అంటే ఇప్పుడు జానపద పాటలకు ఒక బ్రాండ్ అయిపోయింది. ఉద్యమ గేయాలు, ప్రైవేటు ఆల్బమ్స్...ఇలా ఎన్నో పుట్టుకొస్తున్నాయి. సినిమా పాటల కంటే...ఇవే ఓ ఊపు ఊపుతున్నాయి. కానీ ఈ పాట వింటే మాత్రం గుండె బరువెక్కి ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయి. 

2 Min read
Author : Nandini Arava
Published : May 18 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Image Credit : Relare Ganga/Youtube

ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే

తెలంగాణ మట్టివాసనను తన గాత్రంతో ప్రపంచానికి చూపించిన జానపద గాయకుడు రేలారే రాంబాబు. ఆయనపాట పాడితే కేవలం వినిపించడమే కాదు…హృదయాలు బరువెక్కుతాయి. అంతటి శక్తి ఆయన పాటలకు ఉంది. పల్లె బాధలు, బతుకుబండిని లాగుతున్న పేదల కష్టాలు, సామాజిక చైతన్యం..ఇవన్నీ ఆయన పాటల్లో ప్రాణం పోసుకున్నట్టుగా అనిపిస్తాయి. అందుకే రాంబాబు పాట వింటే ప్రతి ఒక్కరికీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. బరువెక్కిన గుండెతో కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాంబాబు
Image Credit : Relare Ganga/Youtube

కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాంబాబు

యాసరాపు రాంబాబు..ఒక సాధారణ వ్యక్తి. రేలారే రాంబాబుగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. దాని వెనుక ఆయన అపారమైన పోరాటం ఉంది. తీవ్రమైన పేదరికంలో పుట్టిన ఆయన… జీవితంలోని చేదు అనుభవాలనే తన గళంగా మార్చుకున్నారు. చదువు కన్నా బతుకుబాటే పెద్ద సవాలుగా మారిన రోజుల్లో కూడా పాటను మాత్రం వదల్లేదు. అదే పట్టుదల ఆయనను తెలంగాణలో అత్యంత ప్రభావవంతమైన జానపద, ఉద్యమ గాయకుల్లో ఒకరిగా నిలబెట్టింది.

35
పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా
Image Credit : Relare Ganga/Youtube

పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా

'పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా' అనే ఒక్క పాటతోనే ఆయన పేరు ఇంటింటికీ చేరింది. ఆ పాటలోని బాధ, ఆవేదన, నిజాయితీ ప్రజల హృదయాలను కదిలించాయి.

పాటమ్మ తోటె ప్రాణంనాకు చదువూలమ్మరా

పేదోలింట్ల బుట్టిన పేగుబంధం నేనురా

అమ్మా నాన్న రెక్కలాడితేనె

బుక్కెడు బువ్వరా

వాళ్ల రెక్కలకష్టపు సెమట

సుక్కల ధారను నేనురా..

వాళ్ల రెక్కలకష్టపు సెమట

సుక్కల ధారను నేనురా..

ఉన్నా రెండు ఎకరాలను కళ్లాజూడలే

మా నాన్నా నాగలి

కర్రూపెట్టీ పొలమూ దున్నలే

ఉన్నా రెండు ఎకరాలను కళ్లాజూడలే

మా నాన్నా నాగలి

కర్రూపెట్టీ పొలమూ దున్నలే

కట్నం కింద అంతా అక్కకు రాసీఇచ్చీనం

కట్నం కింద అంతా అక్కకు రాసీఇచ్చీనం

మా అక్కను బావ గొడితే ఎక్కి ఎక్కీ ఏడ్చినం

చెప్పేటోడు లేకపదీ ఫేలైపోయినా...

చెప్పేటోడు లేకపదీ ఫేలైపోయినా

సదువమ్మా విలువ దెలిసీ...

ఎమ్. ఎ ఇంగ్లీషు పట్టా పొందినా...

పాటమ్మ తోటె ప్రాణంనాకు చదువూలమ్మరా

పేదోలింట్ల బుట్టిన పేగుబంధం నేనురా

అమ్మా నాన్న రెక్కలాడితేనె

బుక్కెడు బువ్వరా

వాళ్ల రెక్కలకష్టపు సెమట

సుక్కల ధారను నేనురా..

సిరిగిన అంగీ లాగులేసుకొని

బాల్యమంతగడిపినా

బత్తసంచిలబుక్కు లేసుకుని

బడికి రోజునేనుబోయినా..

సిరిగిన అంగీ లాగులేసుకొని

బాల్యమంతగడిపినా

బత్తసంచిల బుక్కు లేసుకుని

బడికి రోజునేనుబోయినా..

అమ్మ నాన్న వాళ్ల నెత్తురుని

సత్తువగ జల్లై నను సాధిండ్రూ

అమ్మ నాన్న వాళ్ల నెత్తురుని

సత్తువగ జల్లై నను సాధిండ్రూ

రెండు చేతుల్లొ పొడిచిన పొక్కుల

భాధను గుండెల్లో దాసుకుండ్రూ..

ఏమిచ్చినా మీ రుణముదీర్చలేను ఓ నాన్నా

ఏమిచ్చినా మీ రుణముదీర్చలేను ఓ నాన్నా..

ఈ బాధలు బందయ్యె రోజు దెస్తనే..

జన్మనిచ్చిన అమ్మా ...

పాటమ్మ తోటె ప్రాణంనాకు చదువూలమ్మరా

పేదోలింట్ల బుట్టిన పేగుబంధం నేనురా

అమ్మా నాన్న రెక్కలాడితేనె

బుక్కెడు బువ్వరా

వాళ్ల రెక్కలకష్టపు సెమట

సుక్కల ధారను నేనురా..

కళ్లకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా

కళ్లకు జారిన కన్నీళ్లతో

పాటలెన్నో రాస్తా..

మహనీయుల త్యాగాల దారిలో

నా గొంతును వినిపిస్తా

అక్షరాల ఉక్కు పిడికిళ్లకు ఊపిరిపాటౌతా..

అక్షరాల ఉక్కు పిడికిళ్లకు ఊపిరిపాటౌతా..

చీకటి బతుకుల్లొ వెలుగుల్ల

రాగమై దారులు నేనేస్తా

జ్ఞానంకోసం ధ్యానంచేసిన శంభూకున్నౌతా

జ్ఞానంకోసం ధ్యానంచేసిన శంభూకున్నౌతా..

సదువమ్మ బాటలో పాటను నేనై..

స్వేరో జెండను గుండెకద్దుకుంటా

పాటమ్మ తోటె ప్రాణంనాకు చదువూలమ్మరా

పేదోలింట్ల బుట్టిన పేగుబంధం నేనురా

అమ్మా నాన్న రెక్కలాడితేనె

బుక్కెడు బువ్వరా

వాళ్ల రెక్కలకష్టపు సెమట

సుక్కల ధారను నేనురా..

45
ప్రజల్లో సామాజిక చైతన్యం
Image Credit : Relare Ganga/Youtube

ప్రజల్లో సామాజిక చైతన్యం

అవే కాకుండా 'బహుజన జెండా', 'యువత మేలుకో', 'సావిత్రిబాయి ఫూలే' వంటి పాటల ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో నింపారు. అవి పాటలు అని చెప్పే బదులు సమాజాన్ని ఆలోచింపజేసే ఉద్యమ స్వరాలనే చెప్పుకోవాలి.

55
పోరాట గాథలను తన స్వరంతో ప్రపంచానికి పరిచయం
Image Credit : Relare Ganga/Youtube

పోరాట గాథలను తన స్వరంతో ప్రపంచానికి పరిచయం

‘రేలారే గంగా’ మ్యూజిక్ బృందం ద్వారా తెలంగాణ జానపద సంగీతానికి కొత్త ఊపిరి పోశారు రాంబాబు. పల్లె సంస్కృతి, మట్టిమనుషుల భావోద్వేగాలు, పోరాట గాథలను తన స్వరంతో ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకే రేలారే రాంబాబు పేరు వినగానే… తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image3
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Related Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image2
Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved