Saffron: పహల్గాం దాడి తర్వాత భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర, కేజీ ఎంతో తెలుసా?
ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా పహల్గాం ప్రాంతాల్లోనే ఉత్పత్తి అవుతుంది. అందుకే.. ఆ దాడి తర్వాత అక్కడ దీని సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కుంకుమ పువ్వు మన దేశంలో చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. వంటకు మాత్రమే కాదు.. సహజ సౌందర్య సాధనంగా కూడా దీనిని వాడతారు. బిర్యానీ, స్వీట్లు, పాయసంలో వీటిని జత చేస్తారు. దీనిని చాలా ఖరీదైన మసాలా దినుసుగా పిలుస్తారు. అసలే ఖరీదైనది అంటే.. తాజాగా దీని ధర ఆకాశాన్ని తాకింది. రీసెంట్ గా పహల్గాం సమీపంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రభావం.. కుంకుమ పువ్వుపై పడింది. దీంతో.. ధర భాగా పెరిగిపోయింది. ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా పహల్గాం ప్రాంతాల్లోనే ఉత్పత్తి అవుతుంది. అందుకే.. ఆ దాడి తర్వాత అక్కడ దీని సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కేజీ కుంకుమ పువ్వు ధర రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.
మరి, ఇంత ధర ఉన్నప్పుడు కుంకుమ పువ్వు కొనడం అసాధ్యం అనే అనిపిస్తుంది. కాబట్టి, తక్కువ ధరలో వాటికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరి, అవేంటి? వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కేసరి ఎసెన్స్ (Saffron Essence)
కేసరి ఎసేన్స్ తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తుంది. మీరు కుంకుమ పువ్వు వాడాలి అనుకున్నప్పుడు దాని ప్లేస్ లో ఈ ఎసెన్స్ వాడితే సరిపోతుంది. ఇది కుంకుమ పువ్వు దగ్గరగా ఉండే వాసన, రుచిని ఇస్తుంది. ధర తక్కువగా ఉండటంతో ప్రతిరోజూ వంటల్లో వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.
2. ఫుడ్ కలర్ + గులాబీ వాటర్..
కేసరి రంగు కావాలంటే ఫుడ్ కలర్ ఉపయోగించవచ్చు. వాసన కోసం కొన్ని చుక్కల రోజ్ వాటర్ కూడా కలపొచ్చు. బిర్యానీ, స్వీట్లకు ఇది మంచి ప్రత్యామాయం.
3. కేసరి పొడి
అసలు కేసరి దారాలకు భిన్నంగా, ఈ పొడి తక్కువ ఖర్చుతో లభిస్తుంది. నాణ్యమైన బ్రాండ్‌దే తీసుకోవడం మంచిది.
4. పసుపు (Turmeric)
లేత పసుపు రంగు కావాలంటే చిటికెడు పసుపును పాలలో కలిపి ఉపయోగించవచ్చు. అల్లం పసుపు అయితే ఇంకా మెరుగైన ఫలితం లభిస్తుంది.
కుంకుమ పువ్వు ధరలు పెరిగినా, మీ వంటలకు ఆ రంగు, రుచి, సుగంధాన్ని కోల్పోకుండా ఉంచడానికి ఇవి చవకదారి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రత్యామాయాలు ఉపయోగించవచ్చు.పహల్గాం దాడి దురదృష్టకరమైనదే అయినా, వినియోగదారులు మార్గసూచులు కనుగొంటూ తమ వంటకాలకు రుచి చేర్పుతూనే ఉన్నారు.