MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Kitchen Hack: అన్నం మాడిందా? ఇలా చేస్తే.. కనీసం అన్నం మాడిన వాసన కూడా రాదు..!

Kitchen Hack: అన్నం మాడిందా? ఇలా చేస్తే.. కనీసం అన్నం మాడిన వాసన కూడా రాదు..!

Kitchen Hacks:  పొరపాటున అన్నం వండుతుంటే మాడిపోయిందా? అడుగు తీసేసి.. పైన అన్నం తిందాం అంటే.. మాడు వాసన వచ్చేస్తుంది. దీంతో.. ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేం. దీంతో దానిని తినకుండా పారేస్తూ ఉంటాం. కానీ, సింపుల్ చిట్కాతో మాడు వాసనను తొలగించొచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 03 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వంటింటి చిట్కాలు...
Image Credit : Asianet News

వంటింటి చిట్కాలు...

వంట చేస్తుంటే పొరపాట్లు జరగడం చాలా సహజం. కానీ, మనం కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కోసారి అన్నం, కూరలు మాడిపోతూ ఉంటాయి. అలా మాడినప్పుడు వెంటనే పారేయకుండా.. దానిని సరి చేయాలనే చూస్తాం. ముఖ్యంగా అన్నం మాడిపోయింది అనుకోండి…. అడుగు భాగం తీసేసి.. పైన ఉన్న అన్నాన్ని తిందాం అని అనుకుంటాం. కానీ… మనం ఎంత తినాలని చూసినా.. ఆ మాడు వాసన అన్నం మొత్తం వచ్చేస్తుంది. ఇక.. తినలేక పారేస్తూ ఉంటాం. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… అన్నం మాడు వాసనను తొలగించి.. హ్యాపీగా అన్నం తినేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మాడు వాసన పోగొట్టే చిట్కా...
Image Credit : Getty

మాడు వాసన పోగొట్టే చిట్కా...

చాలా మంది అన్నం మాడిపోగానే అది ఎందుకూ పనికి రాదు అని పారేస్తూ ఉంటారు. కానీ.. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. ఆ అన్నాన్ని మనం తినేలా మార్చుకోవచ్చు. అందుకోసం మనకు ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని.. పొట్టుతో పాటే కడిగి నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత.. ఈ నాలుగు ముక్కలను మాడిన అన్నం గిన్నెలో నాలుగు మూలల్లో లోపలికి నెట్టాలి.  ఆ తర్వాత…. అన్నం గిన్నెపై మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేయండి. 15 నిమిషాల తర్వాత… ఆ ఉల్లిపాయ ముక్కలను బయటకు తీసేస్తే సరిపోతుంది. దీని వల్ల.. అన్నంలోని మాడు వాసన మొత్తాన్ని ఉల్లిపాయలు పీల్చేసుకుంటాయి.

Related Articles

Related image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Related image2
Blouse Pieces Reuse :ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
34
బ్రెడ్ తో చిట్కా...
Image Credit : Getty

బ్రెడ్ తో చిట్కా...

మాడిపోయిన అన్నం లో మాడు వాసనను తొలగించడానికి బ్రెడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిపై బ్రెడ్ స్లైడ్స్ పెట్టాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. తర్వాత బ్రెడ్ ముక్కలు తీసేస్తే… సరిపోతుంది. మాడు వాసన మొత్తం బ్రెడ్ పీల్చుకుంటుంది.  అన్నం తాజాగా మారుతుంది. 

44
పాల చిట్కా....
Image Credit : Getty

పాల చిట్కా....

మాడిపోయిన అన్నం వాసన పోగొట్టానికి పాలు కూడా బాగా సహాయపడతాయి. దీనికోసం… బ్రెడ్ ముక్కలపై రెండు స్పూన్ల పాలను కొన్ని చుక్కలు వేయాలి. తర్వాత… ఈ బ్రెడ్ ముక్కలను అన్నంపై పెట్టాలి.  ఇలా చేయడం వల్ల కూడా మాడు వాసన మొత్తం పోతుంది.

ఇవన్నీ చేయడానికి ముందు మరో ముఖ్యమైన పని కూడా చేయాలి. అంటే…. అన్నం మాడిన వెంటనే…. పైన భాగాన్ని వెంటనే వేరే గిన్నెలోకి తీసేయాలి. అడుగు నల్లగా మారిన అన్నాన్ని..  పైన ఉన్న అన్నంతో కలపకూడదు. అప్పుడే తినడానికి బాగుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Recommended image2
Blouse Pieces Reuse :ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved