MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • Blouse Pieces Reuse :ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?

Blouse Pieces Reuse :ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?

Blouse Pieces: ప్రతి ఒక్కరు ఇంట్లో కనీసం 10 నుంచి 20 వరకు జాకెట్ ముక్కలు ఉంటాయి. ఈ కాలం వాటితో చీరలకు జాకెట్లు కుట్టించుకునేవాళ్లు కరువయ్యారు. మరి, ఆ జాకెట్ ముక్కలను ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 03 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Blouse Piece reuse
Image Credit : Chat GPT

Blouse Piece reuse

ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అంటే చాలు.. ప్రతి ఒక్కరూ ముత్తైదువులను పిలిచి పండు, తాంబూలంతో పాటు జాకెట్ ముక్క పెడుతూ ఉంటారు. ఆ జాకెట్ ముక్కలు ఏ చీరలకూ మ్యాచ్ అవ్వవు. ఒకవేళ మ్యాచ్ అయిన దానిని కుట్టించుకుంటారు మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ జాకెట్ ముక్కలను కొందరు వేరే వాళ్లు తమ ఇంటికి వచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటారు. కానీ... అలా కాకుండా... ఇంట్లోకి ఉపయోగపడేలా వాటిని ఎలా వాడాలో తెలుసా? కేవలం ఇంట్లో వస్తువులకు మాత్రమేకాదు... అదిరిపోయే డ్రెస్సులు కూడా డిజైన్ చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జాకెట్ ముక్కలతో అదిరిపోయే టాప్స్...
Image Credit : Chat GPT

జాకెట్ ముక్కలతో అదిరిపోయే టాప్స్...

జాకెట్ ముక్కలు అన్నీ దాదాపు 80 సెంటీ మీటర్స్ నుంచి 1 మీటర్ వరకూ ఉంటాయి. 1 మీటర్ వరకూ ఉన్నవాటిని సెలక్ట్ చేసుకుంటే.. పని ఈజీ అయిపోతుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి చిన్న ఫ్రాక్స్ ఈజీగా కుట్టించొచ్చు. లేదు.. మా ఇంట్లో ఎవరూ చిన్న పిల్లలు లేరు అనుకుంటే...మీకు సరిపోయేలా కూడా టాప్స్ కుట్టించుకోవచ్చు. ముఖ్యంగా.. జీన్స్, స్కర్ట్స్ మీదకు ఇలాంటి షార్ట్ టాప్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. పింట్రెస్ట్ లో వెతికితే చాలా రకాల మోడల్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చినవి.. డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు నచ్చిన అవుట్ ఫిట్ మీరే డిజైన్ చేసుకున్నవాళ్లు అవుతారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka Rao (@na_sokuluuu)

Related Articles

Related image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Related image2
Paper Bag Hack: Blinkit, Zepto పేపర్ బ్యాగ్స్ పారేస్తున్నారా? వాటితో ఇంటిని అందంగా మార్చేయచ్చు
33
 ఫ్యాబ్రిక్ గాజులు...
Image Credit : Pinterest

ఫ్యాబ్రిక్ గాజులు...

అమ్మాయిలు గాజులు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్, మోడల్స్ కోరుకుంటున్నారు. కాబట్టి... థ్రెడ్ బ్యాంగిల్స్ మాదిరిగా.. ఫ్యాబ్రిక్ గాజులు కూడా తయారు చేసుకోవచ్చు.

హెయిర్ యాక్సెసరీస్...

మీ దగ్గర ఉన్న జాకెట్ ముక్కలు డ్రెస్ కి కంఫర్ట్ గా లేవు అనిపిస్తే.. మీరు వాటితో హెయిర్ యాక్సెసరీస్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్క్రంచీస్ తయారు చేయచ్చు. ఒక్క జాకెట్ ముక్కతో నాలుగైదు తయారౌతాయి. మీ ఫ్రెండ్స్ కి కూడా వాటిని గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. చాలా ట్రెండీగా కూడా కనపడతారు.

పిల్లో కవర్స్...

దాదాపు అందరూ.. ఇంట్లో ఉన్న దిండ్లకు, కుషన్స్ కి కవర్స్ బయట కొంటూ ఉంటారు. అలా కొనాల్సిన అవసరం లేకుండా.. మీరు మీకు నచ్చిన జాకెట్ ముక్కతో దిండుకు కవర్ లాగా కుట్టేయచ్చు. రెండు, మూడు కలిపి డిజైన్ లా మార్చి కూడా మీరు ట్రై చేయవచ్చు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Recommended image2
Paper Bag Hack: Blinkit, Zepto పేపర్ బ్యాగ్స్ పారేస్తున్నారా? వాటితో ఇంటిని అందంగా మార్చేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved