Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Food
  • బీట్రూట్ పచ్చిదా ఉడికిందా? ఏది మంచిది?

బీట్రూట్ పచ్చిదా ఉడికిందా? ఏది మంచిది?

బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రపంచవ్యాప్తంగా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి, అలాంటి బీట్రూట్ ని ఉడికించి తింటే మంచిదా? లేక పచ్చిది తినడం మంచిదా?  

ramya neerukonda | Published : May 21 2025, 04:24 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
బీట్రూట్ రోజూ తింటే..
Image Credit : freepik

బీట్రూట్ రోజూ తింటే..

బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బీట్రూట్ రక్త హీనత తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ బీట్రూట్ ని ఎలా తినాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిని పచ్చిగా తినడం మంచిదా లేక.. ఉడికించి తినడం మంచిదా అనే  డౌట్ మీకు కూడా ఉందా? అయితే.. దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం..

26
బీట్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

బీట్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బీట్రూట్ లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఫోలేట్ (విటమిన్ B9), ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ C ఉన్నాయి. ఫోలేట్ శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

Related Articles

Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!
Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!
36
పచ్చి బీట్రూట్ లో ఏముంది?
Image Credit : freepik

పచ్చి బీట్రూట్ లో ఏముంది?

పోషక విలువలు (100 గ్రాముల్లో): కేలరీలు -43, కార్బ్స్: 9.6 గ్రా, ఫైబర్: 2.8 గ్రా, చక్కెర: 6.8 గ్రా, ప్రోటీన్: 1.6 గ్రా, పొటాషియం: 325 mg, ఐరన్: 0.8 mg, ఫోలేట్: 109 mg, విటమిన్ C: 4.9 mg

పచ్చి బీట్రూట్ తినడం వల్ల ప్రయోజనాలు..

బీట్రూట్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫోలేట్ కణాల పెరుగుదల, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. విటమిన్ C రోగనిరోధక శక్తి, చర్మానికి మంచిది. బెటాలైన్ యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి. సహజ నైట్రేట్లు రక్తపోటును నియంత్రిస్తాయి, శక్తిని పెంచుతాయి.

46
ఉడికించిన బీట్రూట్ లో ఏముంది?
Image Credit : freepik

ఉడికించిన బీట్రూట్ లో ఏముంది?

పోషక విలువలు (100 గ్రాముల్లో):

కేలరీలు: 44

కార్బ్స్: 10.0 గ్రా

ఫైబర్: 2.0 గ్రా

ప్రోటీన్: 1.6 గ్రా

ఇనుము: 0.8 mg

పొటాషియం: 300 mg

ఫోలేట్: 80-100 మైక్రోగ్రాములు

56
ఉడికించిన బీట్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

ఉడికించిన బీట్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ముఖ్యమైన ఖనిజాలు (ఐరన్, పొటాషియం, మెగ్నీషియం) ని కాపాడుతుంది. ఉడికించడం వల్ల విటమిన్ C కొంత తగ్గుతుంది కానీ నైట్రేట్లు ఉంటాయి. ఫోలేట్ కూడా ఉంటుంది, ఇది మెదడు, కణాల మరమ్మత్తుకు అవసరం. ఉడికించిన బీట్రూట్ జీర్ణం చేసుకోవడం సులభం, వృద్ధులకు మంచిది.

66
ఎలా తింటే మంచిది?
Image Credit : Getty

ఎలా తింటే మంచిది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పచ్చి బీట్రూట్ లో విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల అది మరింత ప్రయోజనకరం. యాంటీఆక్సిడెంట్లు నాశనం కావు. నైట్రేట్లు పూర్తిగా ఉంటాయి. అయితే, ఉడికించిన బీట్రూట్ కూడా ఆరోగ్యకరమైనదే, కాకపోతే తక్కువ నీటిలో ఎక్కువసేపు ఉడికించకుండా ఉండాలి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories