- Home
- Life
- Food
- Diabetics: షుగర్ పేషెంట్స్ కోసం.. షుగర్, క్రీమ్ లేని చాక్లెట్ ఐస్ క్రీమ్: ఎలా చేయాలంటే..
Diabetics: షుగర్ పేషెంట్స్ కోసం.. షుగర్, క్రీమ్ లేని చాక్లెట్ ఐస్ క్రీమ్: ఎలా చేయాలంటే..
Diabetics: అసలే వేసవి.. ఎండలు మండిపోతుంటే చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కాని డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా ఆరోగ్యం కోసం తినడం మానేస్తారు. అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ కోసం షుగర్ లేని, క్రీమ్ లేని ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్ లో షుగర్ పేషెంట్ల బాధ వర్ణనాతీతం. ఎండలు మండుతుంటే చల్లగా కూల్ డ్రింక్ తాగలేరు. చల్లగా ఐస్ క్రీమ్ కూడా తినలేరు. అలాంటి వారి కోసం ఇంట్లోనే క్రీమ్, చక్కెర లేకుండా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐస్‌క్రీమ్ రెసిపీ మార్కెట్‌లో లభించే ఐస్‌క్రీమ్ లాగా క్రీమీగా, రుచికరంగా ఉంటుంది.
ఈ ఐస్ క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఫుల్ ఫ్యాట్ పాలు 2 కప్పులు
- డార్క్ కోకో పౌడర్ (చక్కెర లేనిది) 2 టేబుల్ స్పూన్లు
- ఖర్జూరాలు 8–10 (విత్తనాలు తీసి నానబెట్టినవి)
- అరటిపండు 1
- పల్లీ లేదా బాదం వెన్న 1 టేబుల్ స్పూన్
- వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ ½ టీస్పూన్
- చాక్లెట్ చిప్స్ (షుగర్ ఫ్రీ) 1 టేబుల్ స్పూన్
ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం
నానబెట్టిన ఖర్జూరాలను కొద్దిగా పాలు వేసి మిక్సీలో మెత్తని పేస్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేయండి. ఇప్పుడు మిక్సీలో ముక్కలు చేసిన అరటిపండు, కోకో పౌడర్, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ మిగిలిన పాలు వేయండి. పల్లీ వెన్న కూడా వేసి క్రీమీగా అయ్యే వరకు అన్నీ బాగా బ్లెండ్ చేయండి.
తయారైన మిశ్రమాన్ని ఫ్రీజర్ లో ఉంచండి
ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక గాలి కూడా రాని కంటైనర్ లో పోయాలి. పైన షుగర్ లేని చాక్లెట్ చిప్స్ వేసి కంటైనర్‌ను మూతపెట్టి కనీసం 6–8 గంటలు ఫ్రీజర్‌లో ఉంచండి.
తర్వాత స్కూప్ చేసే ముందు 5 నిమిషాలు బయట ఉంచండి. లేదా కావాలనుకుంటే కొద్దిగా బ్లెండ్ చేసి మళ్ళీ ఫ్రీజ్ చేయండి. ఇలా చేస్తే ఇంకా మెత్తగా అవుతుంది.
ఈ ఐస్ క్రీమ్ వల్ల ప్రయోజనాలు
ఈ ఐస్ క్రీమ్ తయారీలో షుగర్ లేదు. కేవలం ఖర్జూరాల తీపి మాత్రమే ఉంటుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్ హాయిగా తినొచ్చు. ఇందులో అరటి పండు ఉపయోగించడం వల్ల క్రీమీగా ఉంటుంది తప్ప ప్రత్యేకంగా క్రీమ్ ఉపయోగించలేదు. షుగర్ పేషెంట్స్, బరువు తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కూడా ఈ ఐస్ క్రీమ్ తినొచ్చు.