MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • Better Sleep tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? మెగ్నీషియం ఉండే ఈ పుడ్స్ ట్రై చేయండి!

Better Sleep tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? మెగ్నీషియం ఉండే ఈ పుడ్స్ ట్రై చేయండి!

మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. మెగ్నీషియం లోపం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ప్రధానమైంది నిద్రలేమి. మరి నిద్ర సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మెగ్నిషియం ఉన్న ఈ ఆహారాలు తీసుకుంటే చాలు.  

2 Min read
Author : Kavitha G
Published : Jul 06 2025, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Magnesium rich foods for better sleep
Image Credit : stockPhoto

Magnesium rich foods for better sleep

మెగ్నీషియం.. శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం. ఇది 300 కంటే ఎక్కువ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మంచి నిద్ర కోసం మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

మెగ్నీషియం.. మెదడులోని గామా అమైనోబ్యూట్రిక్ యాసిడ్ గ్రాహకాలను సక్రియం చేస్తుంది. ఇది ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మెదడు కార్యకలాపాలను తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరచి నిద్రకు సిద్ధం చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిద్రలేమి సమస్యలకు చెక్..
Image Credit : stockPhoto

నిద్రలేమి సమస్యలకు చెక్..

మెగ్నీషియం.. ఒత్తిడి హార్మోన్లు అయినా కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర సులభంగా వస్తుంది. మెగ్నీషియం కండరాల సంకోచాలు, కండరాల సడలింపులో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల రాత్రిపూట కండరాల నొప్పులు లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. 

అంతేకాకుండా నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల సులభంగా నిద్ర వస్తుంది.  

35
మెగ్నీషియం ఉండే ఆహారాలు..
Image Credit : stockPhoto

మెగ్నీషియం ఉండే ఆహారాలు..

ఆకుకూరలు, బ్రోకలి, క్యాబేజీ వంటి ఆకుపచ్చ కూరగాయలు.. బాదం, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు మొదలైన వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. పప్పులు, బీన్స్ వంటి చిక్కుళ్లు కూడా మెగ్నీషియాన్ని కలిగి ఉంటాయి.

ఇవి కాకుండా బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, ఓట్స్ కూడా మెగ్నీషియానికి మంచి వనరులు. కొన్నిరకాల డార్క్ చాక్లెట్‌లో కూడా మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  

45
మెదడు ఆరోగ్యానికి..
Image Credit : stockPhoto

మెదడు ఆరోగ్యానికి..

మెగ్నీషియం శరీరానికి మాత్రమే కాదు.. మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మెదడు సంబంధిత రుగ్మతలను తగ్గించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. 

2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత మెగ్నీషియం తీసుకున్న వారిలో నిద్ర నాణ్యత మెరుగుపడినట్లు తేలింది. 

55
ఇది గుర్తుంచుకోండి..
Image Credit : stockPhoto

ఇది గుర్తుంచుకోండి..

మెగ్నీషియం ఎక్కువగా ఆహారం ద్వారానే శరీరానికి అందుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేని వారికి వైద్యులు సప్లిమెంట్‌లను సూచిస్తుంటారు. నిపుణులను సంప్రదించకుండా ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు.

మెగ్నీషియం లోపం నిద్ర సమస్యలకు ఒక కారణం కావచ్చు. కానీ నిద్రలేమికి చాలా కారణాలు ఉంటాయి. నిద్ర సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Health tips: వీటిలో ఏ ఒక్కటి తిన్నా.. బీపి, షుగర్ కంట్రోల్లో ఉండటం పక్కా!
Recommended image2
Chicken vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గడానికి ఏం తింటే మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved