Mutton: మటన్ వండుతున్నారా? త్వరగా ఉడకాలంటే ఏం చేయాలో తెలుసా?
Mutton: మటన్ తినడం ఇష్టమే కానీ, దానిని వండటమే కష్టం అని చాలా మంది ఫీలౌతుంటారు. ఎందుకంటే, మటన్ అంత ఈజీగా ఉడకదు. ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు.మటన్ చాలా ఫాస్ట్ గా ఉడుకుతుంది.

Mutton
చికెన్ తినడం కంటే.. మటన్ తినడం ఇష్టం అని చాలా మంది చెప్పడం వినే ఉంటారు. కానీ... చికెన్ వండిన అంత సులభం కాదు మటన్ వండటం. ఎందుకంటే... మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... చాలా తక్కువ సమయంలోనే మటన్ మెత్తగా ఉడకడమే కాకుండా.... రుచి కూడా రెట్టింపు అవుతుంది.
సింపుల్ చిట్కాలు...
చిన్న ముక్కలుగా కోసుకోవాలి....
మటన్ వండేటప్పుడు మాంసాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల.. మటన్ చాలా తేలికగా ఉడుకుతుంది. ఇది వంట వండే సమయాన్ని తగ్గిస్తుంది.
మ్యారినేట్ చేయడం ముఖ్యం...
మీరు వంట చేసే సమయాన్ని తగ్గించాలంటే.. అంటే.. తొందరగా మటన్ ఉడకాలంటే.... దానిని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్ కర్రీ రుచిగా రావడమే కాకుండా, చాలా మృదువుగా కూడా ఉడుకుతుంది. అది కూడా నిమ్మకాయ, వెనిగర్, పెరుగు లాంటివి కలిపి మ్యారినేట్ చేయడం చాలా ముఖ్యం.
ఉడికించే విధానం...
మాంసాన్ని త్వరగా ఉడికించడానికి హై టెంపరేచర్ ఉపయోగించండి. అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించడం లేదా వేయించడం వంటి పద్ధతులు మాంసాన్ని వేగంగా ఉడికించడానికి సహాయపడతాయి. కావాలంటే మీరు మటన్ ఉడికించడానికి ప్రెజర్ కుక్కర్ వాడాలి. ప్రెజర్ కుక్కర్ లో కూడా మటన్ చాలా తొందరగా ఉడుకుతుంది. రుచి కూడా బాగుంటుంది.

