ఉల్లిపాయ కోస్తే కళ్లు మండుతున్నాయా? సింపుల్ చిట్కాలు పాటిస్తే, కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయవచ్చు.
ఉల్లిపాయ పొట్టు తీసి, కోయడానికి అరగంట ముందు చల్లటి నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని గ్యాస్ నీటిలో కలిసిపోయి, కన్నీళ్లు రాకుండా ఉంటాయి.
ఉల్లిపాయను కోయడానికి పది నిమిషాల ముందు ఫ్రిజ్‌లో పెట్టండి. ఉల్లిపాయ చల్లగా అవ్వడం వల్ల దానిలోని సల్ఫర్ ప్రభావం తగ్గుతుంది.
గాలి ఎక్కువగా వచ్చే చోట (ఫ్యాన్ ఆన్ చేసి) ఉల్లిపాయలు కోయండి. అప్పుడు సల్ఫర్ కాంపౌండ్స్ నేరుగా మీ కళ్లలోకి రాకుండా గాలికి వెళ్లిపోతాయి.
ఉల్లిపాయ కోసే ముందు, మీరు వాడే కత్తికి కొద్దిగా నిమ్మరసం రాయండి. ఇది కళ్ల మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
ఉల్లిపాయలు కోసేటప్పుడు, మీ పక్కన ఒక గిన్నెలో వేడి నీళ్లు పెట్టుకోండి. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి, ఉల్లిపాయలోని యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది.
Cinnamon Water: పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?
Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?
Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. హెల్దీగా పాలకూర ఇడ్లీ, ఎలా చేయాలో తెలుసా?
Green Chillies: పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!