- Home
- Life
- Food
- Ice Apple: వేసవిలో తాటి ముంజలను తింటున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Ice Apple: వేసవిలో తాటి ముంజలను తింటున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Ice Apple Benefits: వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది తాటి ముంజలు, మామిడి కాయలు, పుచ్చకాయలు తింటుంటారు. ఈ కాలంలో మాత్రమే అవి విరివిగా దొరికే ఈ సీజనల్ ఫ్రూట్స్ కు డిమాండ్ ఎక్కువే. ఇక తాటి ముంజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
తాటి ముంజలు
తాటి ముంజలు, ఐస్ ఆపిల్, తాటి పండు అని పిలువబడే ఈ పండు వేసవిలో దాహాన్ని తీర్చి, శరీరాన్ని చల్లబరుస్తుంది. కొబ్బరికాయను పోలి ఉండే ఈ తాటి ముంజాలలో జెల్లీ లాంటి గుజ్జు ఉంటుంది. చాలా మంది ఈ తాటి ముంజలను ఇష్టపడుతారు. కానీ చాలా మందికి దీని ప్రయోజనాల గురించి తెలియదు. వేసవిలో ఆరోగ్యకరంగా ఉండే ఈ తాటి పండు ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
వివిధ పేర్లు
ఆగ్నేయాసియాలో వేసవిలో మాత్రమే లభించే ఈ ప్రత్యేకమైన పండ్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మహారాష్ట్రలో తడ్గోలా అని, పశ్చిమ బెంగాల్‌లో తాల్, తమిళనాడులో నుంగు అని, తాటి ముంజాలు అని పిలుస్తారు. మలబద్దక నివారణ, బరువు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
తాటి ముంజాల్లోని పోషకాలు
తాటి ముంజలోని పోషకాలను చూద్దాం.. 100 గ్రాముల ఐస్ ఆపిల్‌లో 38 కిలో కేలరీల శక్తి ఉంటుంది. దీనిలో 9.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.6 గ్రాముల ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 1.1 గ్రాముల ఫైబర్ ఉండి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది.
తాటి ముంజాల ప్రయోజనాలు
ఐస్ ఆపిల్ సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణాలను కలిగి ఉంది, ఇది వేసవి రోజుల్లో నిర్జలీకరణను ఎదుర్కోవడానికి అనువైన ఎంపిక. దాదాపు 95 శాతం నీటి ఉండే తాటి ముంజాలను తినడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో సహా పలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది,
మలబద్ధకం, కడుపు సమస్యలకు చెక్
ఐస్ ఆపిల్‌లను తినడం వల్ల మలబద్ధకం, వికారం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. ఈ పండులోని మొక్కల ఆధారిత అంశాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతం చేస్తాయి. అంతేకాకుండా, తాటి ముంజలల్లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, విటమిన్లు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి ఇవి సహాయపడుతుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి, తినాలనే కోరికను తగ్గిస్తుంది.
హృదయ ఆరోగ్యం
తాటి ముంజాల్లో అధిక పొటాషియం, తక్కువ సోడియం ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. రక్తపోటును నియంత్రించడం ద్వారా, హృదయ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు. ఇవి అవసరమైన ఖనిజాలు, విటమిన్లకు బెస్ట్ సోర్స్. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.