Dosa:పప్పు నానపెట్టడం, రుబ్బడం లేకుండానే.. నోరూరించే దోశలు ఎలా చేయాలో తెలుసా?
స్పాంజ్ దోశలు చేయడానికి పెరుగు ఉంటే చాలు. ఈ దోశలు మీకు రుచికి రుచిని మాత్రమే కాదు..ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మన దాహాన్ని తీర్చడమే కాకుండా, కడుపును చల్లగా ఉంచుతాయి.

ఉదయం లేస్తే ఇంట్లో అందరికీ వేడి వేడిగా బ్రేక్ ఫాస్ట్ ఉండాల్సిందే. ఎక్కువగా అందరూ ఇడ్లీ, దోశ లు తినడానికే ఇష్టపడతారు. ఇవి తినడం, చేయడం ఈజీనే కావచ్చు. కానీ ప్రాసెస్ మాత్రం పెద్దదే. ముందు రోజే ఎంత పని ఉన్నా, గుర్తుంచుకొని మరీ పప్పు, బియ్యం,రవ్వ నానపెట్టాలి. కనీసం 6 నుంచి 7 గంటలు నానపెట్టిన తర్వాత..వాటిని గ్రైండ్ చేయాలి.గ్రైండ్ చేసిన పిండిని రాత్రంతా పులియబెట్టాలి. ఆ తర్వాతే దోశ, ఇడ్లీ చేసుకోగలం. ఎప్పుడైనా పప్పు నానపెట్టడం మర్చిపోయామా... ఇక టిఫిన్ ఏం చేయాలా అనే కంగారు వచ్చేస్తూ ఉంటుంది. ఇవేమీ లేకుండా.. ఇంత హడావిడి లేకుండా.. సింపుల్ గా స్పాంజ్ లాంటి దోశలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పాంజ్ దోశలు చేయడానికి పెరుగు ఉంటే చాలు. ఈ దోశలు మీకు రుచికి రుచిని మాత్రమే కాదు..ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మన దాహాన్ని తీర్చడమే కాకుండా, కడుపును చల్లగా ఉంచుతాయి.
దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు...
అవసరమైన పదార్థాలు:
బొంబాయి రవ్వ (సూజి) – 1 కప్పు
పెరుగు – ½ కప్పు
బియ్యం పిండి 3 స్పూన్లు
బేకింగ్ సోడా లేదా ఈనో (ఎన్నీ లేవు అంటే పొడి బేకింగ్ సోడా) – ¼ టీ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నీళ్లు – అవసరానికి
నూనె – కాల్చేందుకు
అల్లం, పచ్చి మిర్చి – మిక్సీలో గ్రైండ్ చేసి పెరుగులో కలపాలి
ఉప్పు, పసుపు, పంచదార – రుచికి తగినంత
తురిమిన క్యారెట్, కొత్తిమీర – చల్లదనం, పోషకాలు అందించేందుకు
తయారీ విధానం:
పెరుగు బాగా బీట్ చేసి, అందులో గ్రైండ్ చేసిన మిశ్రమం కలిపి, తురిమిన క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కొద్దిగా పంచదార కలపాలి.
ఒక పాన్‌లో తాలింపు కోసం నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి తక్కువ మంటపై మగ్గనివ్వాలి.ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పెరుగు మిశ్రమంలో కలపాలి. అందులోనే రవ్వ, బియ్యం పిండి కూడా వేసి కలపాలి. 15 నిమిషాల పాటు పిండిని మూత పెట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని దోసె పెనంపై చిన్న చిన్న దోసెలు వేసుకుని రెండు వైపులా కాల్చాలి. అంతే రుచికరమైన దోశలు రెడీ అయినట్లే.