MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Wheat Flour: మీరు మార్కెట్లో కొనే గోధుమ పిండి స్వచ్ఛమైనదా లేక నకిలీదా గుర్తించేదెలా?

Wheat Flour: మీరు మార్కెట్లో కొనే గోధుమ పిండి స్వచ్ఛమైనదా లేక నకిలీదా గుర్తించేదెలా?

ఇలాంటి పరిస్థితుల్లో, మనం ఉపయోగిస్తున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదా లేక.. నకిలీ చేసిందా అన్నది తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 05 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కల్తీ గోధుమ పిండి గుర్తించేదెలా?
Image Credit : our own

కల్తీ గోధుమ పిండి గుర్తించేదెలా?

ఈరోజుల్లో ప్రతి ఆహారం కల్తీ చేయడం చాలా కామన్ అయిపోయింది. పాలు, నెయ్యి, పన్నీర్ మాత్రమే కాకుండా.. మనం ప్రతిరోజూ వాడే గోధుమ పిండిని కూడా నకిలీ చేస్తున్నారు. ముఖ్యంగా పండగల సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు వ్యాపారులు లాభం కోసం కల్తీకి పాల్పడుతూ ఉంటారు. దీనిని వాడటం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, మనం ఉపయోగిస్తున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదా లేక.. నకిలీ చేసిందా అన్నది తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అలా అని దానిని టెస్టు చేయడానికి మనం ప్రయోగశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సులభమైన పద్ధతులు వాడటం వల్ల మనం పిండి నాణ్యతను గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....

24
కల్తీని గుర్తించే పద్ధతులు..
Image Credit : our own

కల్తీని గుర్తించే పద్ధతులు..

1.వాసన ద్వారా గుర్తించడం...

స్వచ్ఛమైన గోధుమ పిండి సహజమైన మృదువైన, తీపి, తాజా వాసన కలిగి ఉంటుంది. తాజా గోధుమల వాసనలా ఉంటుంది. పిండిలో కల్తీ జరిగితే దాని నుంచి ఘాటైన వాసన లేక.. రసాయనాలు కలిపిన వాసన వస్తుంది. వాసనతో తేడాను మనం చాలా సులభంగా గుర్తించొచ్చు.

2. నీటి పరీక్ష..

ఇది చాలా సులభమైన పద్ధతి. ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో అర టీస్పూన్ గోధుమ పిండిని వేసి కలపండి.

స్వచ్ఛమైన పిండి… పూర్తిగా నీటిలో కరిగి, కొంతసేపటికి అడుగున స్థిరపడుతుంది.

కల్తీ పిండి .. నీటి మీద తేలిపోతుంది లేదా పైభాగంలో పొరలా ఏర్పడుతుంది. అంటే.. ఇందులో గోధుమ పిండితో పాటు ఇతర పౌడర్లు కలిసినట్లు అర్థం చేసుకోవడం.

Related Articles

Related image1
Food Digestion Time: ఏ ఆహారం ఎంత సమయానికి జీర్ణం అవుతుందో తెలుసా ?
Related image2
Food: ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..!
34
3. స్పర్శ ద్వారా గుర్తించడం
Image Credit : Getty

3. స్పర్శ ద్వారా గుర్తించడం

పిండిని మీ చేతుల మధ్య రుద్దినప్పుడు స్వచ్ఛమైన పిండి మృదువుగా, సిల్క్‌లా అనిపిస్తుంది. కల్తీ పిండి రుద్దినప్పుడు జిగటగా లేదా ముతకగా అనిపించవచ్చు. ముఖ్యంగా రవ్వ లాంటి గరుకుదనం ఉంటే, లేదా రసాయనాల వాసన వస్తే, ఆ పిండిని ఉపయోగించకపోవడమే మంచిది.

4. పొట్టు..

ఆరోగ్యకరమైన గోధుమ పిండిలో సహజమైన పొట్టు ఉండాలి. ఇది ఫైబర్ కి మంచి మూలం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పూర్తిగా మెత్తగా, పొట్టు లేకుండా ఉండే పిండి ఎక్కువగా ప్రాసెస్‌ చేసినది గుర్తించాలి. ఇలా ప్రాసెస్ చేసిన పిండిలో పోషకాలు ఉండవు.

5. రంగు, రూపం

స్వచ్ఛమైన గోధుమ పిండి లేత గోధుమ రంగులో ఉంటుంది. కల్తీ పిండికి అసహజంగా తెలుపు లేదా పసుపు రంగు ఉండవచ్చు. అలాగే, పిండిలో చిన్నచిన్న రాళ్లు, ధూళి లేదా వేరే దినుసులు కనపడితే అది కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది.

44
చపాతీలు తయారు చేసే సమయంలో కూడా..
Image Credit : Freepik

చపాతీలు తయారు చేసే సమయంలో కూడా..

పిండితో రొట్టెలు లేదా చపాతీలు చేసినప్పుడు అవి సహజమైన రుచి, వాసన ఇవ్వాలి. కల్తీ పిండితో చేసిన వంటకాలు రుచి, రంగు, వాసనలో తేడా చూపిస్తాయి. చపాతీలు త్వరగా ఎండిపోవడం, గట్టిగా మారడం కూడా కల్తీ సూచన.

ఫైనల్ గా..

పిండిలో కల్తీని గుర్తించడం కష్టమైన పని కాదు. వాసన, రంగు, రూపం, స్పర్శ, నీటిలో కరిగే తీరు వంటి సులభమైన పరీక్షలతో మనం ఇంట్లోనే దీన్ని తెలుసుకోవచ్చు. కల్తీ పిండిని వాడటం ఆరోగ్యానికి హానికరం . ఇది జీర్ణ సమస్యలు, విష ప్రభావాలు, దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కావచ్చు. అందుకే పిండిని విశ్వసనీయమైన వనరుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.

ఈ చిన్నచిన్న పరీక్షలు అలవాటు చేసుకుంటే, ప్రయోగశాలకు వెళ్లకుండానే కల్తీ పిండిని సులభంగా గుర్తించవచ్చు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, మోసపోకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Recommended image2
Tomato: ఏడాది మొత్తం టమాటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?
Recommended image3
Ugadi Special Dishes: ఉగాది పండక్కి ఈ వంటలు మీ ఇంట్లో చేస్తారా!
Related Stories
Recommended image1
Food Digestion Time: ఏ ఆహారం ఎంత సమయానికి జీర్ణం అవుతుందో తెలుసా ?
Recommended image2
Food: ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved