Food Digestion Time: ఏ ఆహారం ఎంత సమయానికి జీర్ణం అవుతుందో తెలుసా ?
health-life Jul 19 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
చికెన్
చికెన్ వంటి మాంసాహారం జీర్ణం కావడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే జీర్ణక్రియ సమయం అనేది వ్యక్తుల ఆరోగ్య స్థితి, వయస్సు, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.
Image credits: Asianet News
Telugu
గుడ్డు
గుడ్డు జీర్ణం కావడానికి సాధారణంగా సుమారు 30 నిమిషాలు సరిపోతుంది. పచ్చి గుడ్డు కంటే ఉడికిన గుడ్డు లేదా వండిన గుడ్డు వేగంగా జీర్ణమవుతుంది.
Image credits: Our own
Telugu
క్యారెట్
క్యారెట్ వంటి పీచు ఆహారపదార్థాలు కేవలం 30 నిమిషాల్లో జీర్ణమవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉడికిన క్యారెట్ మరింత సులభంగా జీర్ణం అవుతుంది.
Image credits: Social Media
Telugu
కర్బూజ
కర్బూజ వంటి నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు సాధారణంగా 20 నిమిషాల్లో జీర్ణమవుతాయి. ఇవి తేలికపాటి ఆహారం కావడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
Image credits: Freepik
Telugu
నీరు
నీరు జీర్ణం కావడానికి అంటే.. కడుపు నుండి ఆంత్రాలలోకి చేరడానికి సుమారు 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. శరీరంలో శోషణ ప్రక్రియకు వేగవంతం చేస్తుంది.
Image credits: Getty
Telugu
బంగాళదుంప
బంగాళదుంప జీర్ణం కావడానికి 1 గంట సమయం పడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉడికించిన లేదా వేపిన బంగాళదుంప వేగంగా జీర్ణమవుతుంది
Image credits: Social Media
Telugu
ఆపిల్
ఆపిల్ జీర్ణం కావడానికి సుమారు 40 నిమిషాలు పడుతుంది. ఇందులో అధిక ఫైబర్, నీటి శాతం కలిగి ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది.
Image credits: Getty
Telugu
బాదం
బాదం (Almonds) జీర్ణం కావడానికి సాధారణంగా 3 గంటల వరకు సమయం పడుతుంది. బాదాల్లో కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
Image credits: freepik
Telugu
జీడిపప్పు
జీడిపప్పు జీర్ణం కావడానికి సాధారణంగా 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఇవి అధిక కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ కలిగి ఉండటం వల్ల శరీరానికి జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.