Health
నెయ్యి కొందరికి జీర్ణం కావడం కష్టం. దీనివల్ల అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
నెయ్యి రక్తంలో చక్కెరను పెంచకపోయినా ఎక్కువ తింటే ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు వస్తాయి.
బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు నెయ్యి తింటే బరువు మరింత పెరుగుతారు. ఇంకా చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
గుండె సమస్యలు ఉంటే డాక్టర్ సలహా లేకుండా నెయ్యి తినకూడదు. ఇది కొవ్వు స్థాయిని మరింత పెంచుతుంది.
కాలేయ సమస్యలు ఉంటే నెయ్యికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
నెయ్యిలో కొవ్వు ఉండటం వల్ల ఇది చెడు కొవ్వును పెంచుతుంది. కాబట్టి ఎక్కువ కొవ్వు ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు.