30ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవి..!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పని సరిగా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. మరి ముఖ్యంగా మహిళలు ప్రతి దశలోనూ మార్పుకు లోనవుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ళ తరువాత వారిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరుగుతారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే 30ఏళ్ళు నిండినవారు కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తినాలి.

పోషకాహారం
30 ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఈ సమస్యలు ఎక్కువ. ఈ సమయంలో పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మల్టీవిటమిన్లు
బిజీ షెడ్యూల్ ఉన్నవారికి, సరిగ్గా తినలేని వారికి ఇది చాలా అవసరం. విటమిన్ బి, జింక్, ఐరన్ ఉన్న మంచి క్వాలిటీ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
విటమిన్ సి
విటమిన్ సి.. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం, కాలుష్యం వంటి సమయాల్లో ఇది చాలా అవసరం. చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్ సి చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు విటమిన్ సి అధికంగా అందిస్తుంది.
కాల్షియం
కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనపడతాయి. ముఖ్యంగా స్త్రీలు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. లేదా పాలు, పెరుగు, జున్ను, బ్రోకలీ, పాలకూర వంటి ఆకుకూరలు అధికంగా తినాలి. కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను చెక్ పెట్టవచ్చు.
విటమిన్ డి
విటమిన్ డి: విటమిన్ డి కూడా చాలా ముఖ్యమైనది. చేపలు (సాల్మన్, మాకేరెల్), గుడ్డులోని పచ్చసొన, ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి వల్ల ఎముకలు గా మారుతాయి. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రోటీన్
ప్రోటీన్: 30 ఏళ్ళ తర్వాత ఎముకలు గట్టిగా ఉండటం చాలా ముఖ్యం. ఎముకల నిర్మాణం, మరమ్మత్తులకు ప్రోటీన్ అవసరం. ఎముకలు గట్టిగా ఉండాలంటే, శక్తి కావాలంటే ప్రోటీన్ తీసుకోవాలి. బీన్స్, పప్పులు, బాదం, మొలకెత్తిన గింజలు కూడా తినవచ్చు.
మెగ్నీషియం
మెగ్నీషియం: మెగ్నీషియం కూడా ఎముకలు ద్రుఢంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. లేదా బాదం, చియా గింజలు, ధాన్యాలు, చాక్లెట్ తినవచ్చు.