Hot water: రోజూ పరగడుపున వేడి నీళ్లు తాగితే ఏమౌతుంది?
Hot Water: చల్లని నీరు కండరాల సంకోచం కలిగించొచ్చు. అయితే... గోరువెచ్చని నీరు శరీరాన్ని రిలాక్స్ చేసి కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యల వల్ల వచ్చే అసౌకర్యాల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Hot water
ఉదయం లేవగానే చాలా మంది టీ, కాఫీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ, రోజూ పరగడుపున టీ, కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కానీ... వాటికి బదులు వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? ఇలా హాట్ వాటర్ తాగడం అనేది చాలా చిన్న మార్పు అనిపించినా... ఆరోగ్యంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బరువు తగ్గడం దగ్గర నుంచి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం వరకు చాలా లాభాలు ఉన్నాయి. అయితే... ఎంత ఉష్ణోగ్రత వద్ద నీరు తాగాలి? ఎంత తాగాలి? దీని వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం....
బరువు తగ్గించడంలో వేడి నీరు...
వేడి నీరు శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున వేడి నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల శరీరం శుభ్రపడుతుంది. అదనంగా, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా.. శరీరంలో కొవ్వు కరిగిపోవడానికి కారణం అవుతుంది.
నొప్పులు తగ్గించే వేడి నీరు...
చల్లని నీరు కండరాల సంకోచం కలిగించొచ్చు. అయితే... గోరువెచ్చని నీరు శరీరాన్ని రిలాక్స్ చేసి కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యల వల్ల వచ్చే అసౌకర్యాల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
సైనస్ సమస్యల నుంచి ఉపశమనం...
ముక్కు దిబ్బడ, శ్లేష్మం అధికంగా ఉన్నవారికి వేడి నీరు ఒక సహజ ఉపశమన మార్గం అని చెప్పొచ్చు. వేడి నీరు శ్లేషాన్ని పలచగా చేసి బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీని వల్ల శ్వాస మరింత సులభంగా మారుతుంది.
దంతాల ఆరోగ్యం...
చాలా వేడి నీరు కాకుండా గోరువెచ్చని నీరు తాగడం దంతాలకు మంచిది. సున్నితమైన దంతాలు ఉన్నవారికి ఇది సురక్షితమైన మార్గం. కానీ తాగుతున్న నీరు మితంగా వేడి ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వేడి నీరు చిగుళ్ళు, ఎనామెల్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
శరీరాన్ని డీటాక్స్ చేయడానికి...
వేడి నీరు శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ప్రేరేపిస్తుంది. చెమట ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళ్తాయి. వేడి నీటితో పాటు గ్రీన్ టీ కూడా ఇలాంటి ప్రయోజనాలు అందిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పేగుల కదలికలు మందగించడం, మలబద్ధకం వంటి సమస్యలకు వేడి నీరు అద్భుతమైన సహజ పరిష్కారం. ఇది పేగుల్లో రక్త ప్రసరణను పెంచి ఆహారం సజావుగా కదలడానికి సహాయపడుతుంది. రోజూ ఉదయం ఒక గ్లాస్ వేడి నీరు తాగడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఫైనల్ గా...
ఉదయాన్నే వేడి నీరు తాగే సాధారణ అలవాటు శరీరాన్ని లోపల నుండి శుభ్రపరచడమే కాకుండా, బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపరగడం, నొప్పులు తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పూర్తిగా సహజమైన, ఖర్చు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య రహస్యం.

