Kitchen Hacks: ఉదయం చేసిన రోటీలు.. రాత్రికి కూడా మెత్తగా ఉండాలా? ఇవి ఫాలో అయితే చాలు
Kitchen hacks: రోటీ, చపాతీలు మెత్తగా రావాలి అంటే.... పిండి కలుపుకునే విధానం దగ్గర నుంచి... వాటిని కాల్చి, నిల్వ చేసే వరకు చిన్న చిన్న జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

Kitchen Hacks
రోటీ, చపాతీలు మొత్తగా రెండు వేళ్లతో తుంచేలా ఉంటే తినడానికి చాలా బాగుంటాయి. కానీ, వీటిని రోజంతా మెత్తగా చేయడం చాలా మందికి కష్టం అనే చెప్పొచ్చు. చేసిన వెంటనే మెత్తగా ఉన్నా... కాసేపటికే గట్టిగా అట్టముక్కల్లా తయారౌతాయి. అలా కాకుండా... ఉదయం చేసినా రాత్రి వరకు అవి మెత్తగా ఉండేలా కూడా చేసుకోవచ్చు. దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ పద్దతులు వాడితే సరిపోతుంది. మరి, దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం....
పిండి కలపడం...
రోటీ లేదా చపాతీ చేయాలంటే పిండి కలుపుకోవడం చాలా ముఖ్యం. అయితే... ఆ పిండి కలిపేటప్పుడు కేవలం పిండిలో నీరు పోయడం కాకుండా.... చిన్న ట్రిక్ ఫాలో అవ్వాలి.నీరు కలపడానికి ముందు అందులో కొద్దిగా పాలు పోసి అప్పుడు పిండి కలుపుకోవాలి. లేదంటే. ఒక టీ స్పూన్ నూనె లేదా నెయ్యి అయినా కలుపుకోవచ్చు. ఈ రెండింటినీ కలపడం వల్ల.. చపాతీ పిండి చాలా మృదువుగా మారుతుంది. పాలు పోయడం వల్ల పిండి తేమగా ఉంటుంది. నూనె.. రోటీ గట్టిపడకుండా మెత్తగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా పిండిని కలిపి కనీసం 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఏదైనా వస్త్రాన్ని తడిపి.. ఆ పిండి మీద కప్పాలి. ఇలా చేయడం వల్ల రోటీలు మెత్తగా వస్తాయి.కాల్చేటప్పుడు కూడా పూరీల్లా పొంగుతాయి.
రోటీలు కాల్చే విధానం...
రోటీలు కాల్చే సమయంలో తవా బాగా వెడెక్కిందో లేదో చూసుకోవాలి. తక్కువ వేడి మీద రోటీలను కాలిస్తే... అవి గట్టిగా, ఎండిపోయినట్లుగా అవుతాయి. తవా బాగా కాలిన తరవాత రోటీలను కాలిస్తే... అవి మంచిగా పూరీల్లా పొంగుతాయి. ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి. వీటిని కాల్చే సమయంలో కూడా మీరు నెయ్యి వాడొచ్చు.
రోటీలు స్టోర్ చేసే విధాం....
వేడి వేడిగా కాల్చిన రోటీలను డైరెక్ట్ గా ఏదైనా పాత్రలో పెట్టడానికి బదులు ఏదైనా శుభ్రమైన వస్త్రంలో పెట్టడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అదనపు తేమను గ్రహిస్తుంది. రోటీలను ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటాయి. ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. ఉదయం చేసినా రాత్రి వరకు మెత్తగా ఉంటాయి.
గాలి చొరబడని కంటైనర్ లో స్టోర్ చేయడం....
రోటీలను నార్మల్ పాత్రలో కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. ఇలా చేయడం వల్ల గాలి తగలదు. తొందరగా ఎండిపోయినట్లుగా, గట్టిగా అవ్వగుండా ఈ ఎయిర్ కంటైనర్లు హెల్ప్ చేస్తాయి. మెత్తగా కూడా ఉంటాయి. ఇలా స్టోర్ చేసే సమయంలో వాటిపై తేలికగా నెయ్యి రాయండి. రుచి రెట్టింపు అవుతుంది.