MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Dosa Batter : రుబ్బిన దోశ పిండి ఎన్ని రోజులు వాడాలో తెలుసా?

Dosa Batter : రుబ్బిన దోశ పిండి ఎన్ని రోజులు వాడాలో తెలుసా?

Dosa Batter: సాధారణంగా దోశ పిండిని చాలా మంది ఎక్కువ రుబ్బుకొని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కానీ, ఈ పిండిని ఇంట్లో తయారు చేసే సమయంలో, స్టోర్ చేసే సమయంలో పొరపాట్లు చేస్తే.. ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా?  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 24 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దోశ పిండి...
Image Credit : Pinterest

దోశ పిండి...

సౌత్ ఇండియన్స్ కి బ్రేక్ ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇడ్లీ, దోశలు మాత్రమే.  ఇంట్లో అయినా అవే చేసుకుంటారు.. బయటకు వెళ్లినా అవే తింటారు. అయితే… మనం ఇంట్లో ఇడ్లీ, దోశలు చేసుకోవాలంటే వాటికి పిండి తయారు చేసుకోవడం ముఖ్యం. చాలా మంది.. వారానికి సరిపడా పిండి రుబ్బుకొని.. ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ.. ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసిన పిండితో దోశలు చేసుకొని తినడం మంచిదేనా? ఎక్కువ రోజులు స్టోర్ చేసిన పిండితో బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దోశ పిండి తయారీ...
Image Credit : Pinterest

దోశ పిండి తయారీ...

దోశ పిండిని బియ్యం, మినపప్పుతో చేస్తారు. ఈ రెండింటినీ 6 నుంచి 7 గంటలు నానపెట్టి తర్వాత రుబ్బుకుంటారు. ఆ తర్వాత దీనిని పులియబెడతారు. ఇలా పులియబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.  అయితే.. ఫ్రిజ్ లో పెట్టినా కూడా పులియ బెట్టే ప్రక్రియ ఆగదు. కేవలం నెమ్మదిగా జరుగుతుంది. అయితే.. పిండి రుబ్బుకున్న 3 రోజుల తర్వాత ఆ పిండిలోని కార్బో హైడ్రేట్స్ విచ్ఛిన్నమై, ఆల్కహాల్ వంటి పదార్థాలు హానికరమైన ఈస్ట్ పెరుగుతాయి.

పిండిని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అందులో ఆమ్లత్వం పెరుగుతుంది.  పిండి అలా మారిన తర్వాత దానితో చేసిన దోశ తినడం వల్ల కడుపులో మంట లేదా గుండెల్లో మంట రావచ్చు.  పులిసిన పిండిలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది.  ఈ పిండితో చేసిన దోశలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.  ముఖ్యంగా ఇలా పులిసిన పిండితో చేసిన వంటలు పిల్లలు, ముసలివాళ్లు తినకపోవడమే మంచిది.

Related Articles

Related image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Related image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
34
ఎన్ని రోజులు వాడాలి?
Image Credit : Pinterest

ఎన్ని రోజులు వాడాలి?

అందుకే పిండిని మితంగా రుబ్బుకోవాలి. కేవలం 2 లేదా 3 రోజులకు సరిపడా పిండిని మాత్రమే రుబ్బడం ఉత్తమం. పిండిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాల కన్నా స్టీల్ లేదా గాజు పాత్రలు వాడటం సురక్షితం. ఫ్రిజ్‌లో పెట్టే ముందు పిండిలో ఉప్పు కలపకపోతే అది త్వరగా పులవదు. అవసరమైనప్పుడు మాత్రమే ఉప్పు కలుపుకోవాలి.
44
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Image Credit : Pinterest

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ముఖ్యంగా పిండి నుంచి ఎక్కువ పుల్లటి వాసన వస్తున్నా లేదా రంగు మారినా, దాన్ని వెంటనే పడేయడం మంచిది. తాజాగా రుబ్బిన పిండితో చేసిన ఆహారం తింటే పూర్తి పోషకాలు అందుతాయి. రుచి కన్నా ఆరోగ్యమే ముఖ్యం. కాబట్టి వీలైనంత వరకు తాజాగా చేసిన పిండినే వాడటానికి ప్రయత్నించండి. పిండిలో ఏమాత్రం తేడా కనిపించినా రిస్క్ తీసుకోకుండా దాన్ని వాడకపోవడమే శ్రేయస్కరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved