MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!

Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!

 Tamarind: చాలా రకాల వంటలకు చింత పండు రుచిని పెంచుతుంది. అలాంటి చింత పండును సరిగా నిల్వ చేయకపోతే రంగు నల్లగా మారుతుంది. సరిగా నిల్వ చేస్తే సంవత్సరమైనా తాజాగా ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 23 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Tamarind
Image Credit : instagram

Tamarind

భారతీయులు తమ వంటలో రెగ్యులర్ గా చింతపండు వాడుతూ ఉంటారు. దీనిని చాలా మంది ఎక్కువ క్వాంటిటీ కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే.. కొన్నప్పుడు చూడటానికి ఎర్రగా, తాజాగా బానే ఉంటుంది. కానీ, రోజులు గడిచే కొద్దీ చింతపండు రంగు మారిపోతూ ఉంటుంది. అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఎన్ని సంవత్సరాలు అయినా చింత పండు నల్లగా మారకుండా తాజాగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చింతపండు తాజాగా ఉంచే చిట్కాలు..
Image Credit : Getty

చింతపండు తాజాగా ఉంచే చిట్కాలు..

మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన చింతపండులోని పీచు, గింజలను తొలగించి, దానికి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నలిపి.. ఎండలో ఆరబెట్టి డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చింతపండు గట్టిగా రాయిలాగా మారదు. అంతేకాకుండా.. రంగు మారకుండా , తాజాగా కనపడుతుంది.

అంతేకాదు.. చింత పండులోని పీచు, గింజలను తొలగించి.. ఆ చింతపండును జిప్ లాక్ కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి. ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింత పండు తాజాగా ఉంటుంది.

అలాకూడా కాదు అంటే.. చింత పండు గుజ్జు ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ చింత పండు గుజ్జు ను గాజు సీసాలో నిల్వ చేసుకుంటే సంవత్సరమంతా తాజాగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి సౌలభ్యంగా కూడా ఉంటుంది.

అంతేకాదు..గింజలు తీసేసిన చింతపండును గాలి చొరబడని డబ్బాల్లో ఉంచి ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కూడా రంగు మారదు. కాకపోతే.. కాస్త గట్టిగా మారే అవకాశం ఉంటుంది.

33
కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన చిట్కాలు..
Image Credit : Getty

కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన చిట్కాలు..

గింజలు , పీచు తొలగించడం: చింతపండును నిల్వ చేసే ముందు అందులో ఉన్న గింజలు, పీచు,పెంకులను పూర్తిగా తొలగించాలి. దీనివల్ల పురుగులు పట్టకుండా ఉంటుంది.

ఎండలో ఆరబెట్టడం: చింతపండులో కొద్దిగా తేమ ఉన్నా అది త్వరగా నల్లగా మారుతుంది. అందుకే నిల్వ చేసే ముందు ఒక రోజంతా ఎండలో బాగా ఆరబెట్టాలి.

ఉప్పు కలపడం: చింతపండుకు కొద్దిగా రాళ్ల ఉప్పు కలిపి నిల్వ చేయడం వల్ల అది రంగు మారకుండా, పాడవకుండా ఉంటుంది. పొరలు పొరలుగా చింతపండును అమర్చి, ప్రతి పొర మధ్యలో ఉప్పు చల్లాలి.

సరైన పాత్రలు: చింతపండును ఎప్పుడూ ప్లాస్టిక్ లేదా గాజు పాత్రలలో, లేదా జాడీలలో మాత్రమే నిల్వ చేయాలి. స్టీల్ లేదా అల్యూమినియం పాత్రలలో నిల్వ చేస్తే పాత్రలు పాడవ్వడమే కాకుండా చింతపండు రంగు మారుతుంది.

తేమ తగలకుండా చూడాలి: చింతపండు ఉన్న పాత్రను తడి లేని పొడి ప్రదేశంలో ఉంచాలి. వాడుకునేటప్పుడు కూడా తడి చేతులు పెట్టకుండా పొడి స్పూన్ వాడటం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Recommended image2
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved