Mutton Curry: ఆదివారం మటన్ కుమ్మేస్తున్నారా.? తిన్న తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి
ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో కచ్చితంగా మటన్ ఉండాల్సిందే. చికెన్ కంటే ఎక్కువగా చాలా మంది మటన్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే మటన్ తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మటన్ తిన్న వెంటనే కొన్ని వస్తువులను తీసుకోకూడదని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

mutton curry
మటన్‌లో ఐరన్, ప్రోటీన్‌తో పాటు ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సుమారు 100 గ్రాముల మటన్‌లో 33 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అలాగే మటన్‌లో జింక్, విటమిన్ బీ12 కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే మటన్‌ను తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే మంచిదని అతిగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
మోతాదుకు మించి మటన్ తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మటన్‌ను ఎక్కువగా తింటే శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మటన్‌ను మితంగా తీసుకోవడమే మంచిది సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మటన్ తిన్న వెంటనే కొన్ని రకాల ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని అంటున్నారు.
mutton
వీటితో అస్సలు తీసుకోకూడదు..
* మటన్ తిన్నవెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఆలుగడ్డ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటిని ఒకేసారి తీసుకుంటే అజీర్తి, వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది.
* మనలో చాలా మంది మటన్ తింటూ కూల్‌డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదని అంటున్నారు. అలాగే పండ్ల రసాలు కూడా తాగకూడదు. పండ్ల రసాలు తీసుకుంటే గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు అంటున్నారు.
* మటన్ తినగానే పాలు అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక్క మటన్ మాత్రమే కాకుండా ఏ నాన్ వెజ్ తిన్న తర్వాత అయినా పాలు తాగకూడదు. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
* మటన్ తిన్నవెంటనే తేనె తీసుకోకూడదు. ఇది కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంద. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
* మనలో కొందరికీ మటన్, పెరుగు కలిపి తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇది మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు. మటన్ కర్రీలో పెరుగును కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇది కూడా చదవండి: OYO ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.?
Recharge Plan: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా.. కేవలం రూ. 99కే